Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 18/09/2024

 

AP Cabinet Meeting Highlights – 18/09/2024

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 18/09/2024

=====================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 18-09-2024 LIVE

LIVE - ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=iVKu9bBrdP0

===================== 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:

> నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ. 99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

> భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

> వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినేట్ సమావేశంలో చర్చించారు. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

> వాలంటీర్లు, సచివాలయాలకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు చేశారు.

> పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయం. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల తదనంతరం ఏమైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడిన మంత్రివర్గం.

> ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ 'స్టెమీ' పథకం ప్రారంభం.

> ఆధార్ తరహాలో విద్యార్థులకు 'అపార్' గుర్తింపు కార్డులు

> హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు. కొత్త కార్పొరేషన్ కు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్

> వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు. 

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags