Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Flipkart ‘Big Billion Days' Sale 2024: Dates Announced – Details Here

 

Flipkart ‘Big Billion Days Sale 2024: Dates Announced – Details Here

ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

======================

UPDATE 18-09-2024

స్మార్ట్ ఫోన్ ల మీద ఆఫర్ ల వివరాలు ఇవే

‘బిగ్ బిలియన్ డేస్’ 2024 సేల్ లో  భాగంగా గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్ పై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మొబైల్ 8జీబీ+ 128 జీబీ వేరియంట్ MRP రూ.75,999 కాగా.. ఫ్లిప్కార్ట్ సేల్ లో రూ.40,000 కంటే తక్కువ ధరకే లభించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy_s23) 8జీబీ+ 128జీబీ వేరియంట్ ను  రూ.40వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఎస్ఈ (Samsung Galaxy S23 FE) బేస్ వేరియంట్ మొబైల్ రూ.30వేల లోపే లభించనుంది.

పోకో ఎక్స్ 6 ప్రో 5జీ ( Poco X6 Pro 5G) కూడా రూ. 20వేల లోపే కొనుగోలు చేయొచ్చు. సీఎంఎఫ్ ఫోన్1, నథింగ్ ఫోన్ 2, పోకో ఎం6 ప్లస్, వివో టీకిఎక్స్, ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో.. మొబైల్స్ ను ఈ సేల్ లో తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

======================

ఫ్లిప్ కార్ట్ ఏటా నిర్వహించే 'బిగ్ బిలియన్ డేస్' సేల్ (Flipkart's Big Billion Days Sale 2024) తేదీలను ప్రకటించింది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి సేల్ మొదలు కానుందని తెలిపింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26నే సేల్ అందుబాటులోకి రానుందని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈ సేల్ అక్టోబర్ 6 వరకు కొనసాగనుంది.  

బిగ్ బిలియన్ సేల్లో భాగంగా HDFC క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులకు డిస్కౌంట్ అందిచనున్నారు. ఫ్లిప్కార్ట్- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష వరకు రుణ సదుపాయం పొందొచ్చని పేర్కొంది.

బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు లభించనున్నాయి. యాపిల్, శాంసంగ్, వస్, షావోమీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ లభించేదీ త్వరలో వెల్లడించనున్నారు. యాపిల్ 16 సిరీస్ లాంచ్ అయిన వేళ.. పాత ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లతో పాటు టీవీలు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లు, దుస్తులు, గృహోపకరణాలపైనా ఆఫర్లు లభించనున్నాయి.

======================

WEBSITE

MOBILE APP - ANDROID

MOBILE APP - iPHONE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags