Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Navy Recruitment 2024 – Apply for 250 SSC Officer Posts – Details Here

 

Indian Navy Recruitment 2024 – Apply for 250 SSC Officer Posts – Details Here

భారత నౌకాదళంలో 250 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు - ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు

=====================

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత నౌకాదళం... షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎన్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ) జూన్ 2025లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలుంటాయి. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.

1. జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్: 56 పోస్టులు

2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 20 పోస్టులు

3. నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 21 పోస్టులు

4. పైలట్: 24 పోస్టులు

5. లాజిస్టిక్స్: 20 పోస్టులు

6. ఎడ్యుకేషన్: 15 పోస్టులు

7. ఇంజినీరింగ్ బ్రాంచి (జనరల్ సర్వీస్): 36 పోస్టులు

8. ఎలక్ట్రికల్ బ్రాంచి (జనరల్ సర్వీస్): 42 పోస్టులు

9. నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్: 16 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 250

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు.

ఎంపిక విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14-09-2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29-09-2024.

=====================

REGISTER

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags