Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

iPhone 16 Series Launched: Prices & Specifications Details Here

 

iPhone 16 Series Launched: Prices & Specifications Details Here

ఐఫోన్ 16 సిరీస్ విడుదల: ధర & ఫీచర్ల వివరాలు ఇవే

=====================

యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్ పాడ్స్   4ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ ఈవెంట్ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు అనేక కొత్త ఆవిష్కరణలతో వచ్చాయి. ఈ కొత్త మోడళ్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ ను ప్రధాన ఆకర్షణగా మారింది. కొత్తగా టచ్ సెన్సిటివ్ కెమెరాతో పాటు, యాక్షన్ బటన్ ఇచ్చారు. కొత్త సిరీస్ ఫోన్లలో ఏ18 చిప్ అమర్చారు. న్యూరల్ ఇంజిన్ తో కూడిన ఈ చిప్ రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

సెప్టెంబర్ 13 నుంచి ముందస్తు బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త మోడళ్లలో యాపిల్ మ్యాగ్ సేఫ్  ఛార్జింగ్ స్పీడ్ ను 15 వాట్స్ నుంచి 25 వాట్స్ కు పెంచింది. ఇక భారత్ లో ధరల విషయానికి వస్తే ఐఫోన్ 15 మోడళ్లతో పోలిస్తే 16 మోడళ్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి.

ఐఫోన్ 16, 16 ప్లస్ ధరలు &  ఫీచర్లు:

ఐఫోన్ 16 సిరీస్ లో పలు కొత్త ఫీచర్ల ను యాపిల్ పరిచయం చేసింది. కొత్త సిరీస్ ఫోన్లను ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో రూపొందించారు. ఐఫోన్ 16 డిస్ప్లే 6.1 అంగుళాల పొడవు ఉంటుంది. వెనిలా వేరియంట్తో దీన్ని రూపొందించారు. ఐఓఎస్ 18తో ఇది పనిచేస్తుంది. 2000 నిట్స్ వరకు బ్రైటెనెస్ను పెంచుకోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ డిస్ప్లే 6.7 అంగుళాల పొడవుతో ఇచ్చారు. దీంట్లో సూపర్ రెటినా ఎక్స్ఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే వెనక వైపు 48 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఇచ్చారు. ముందువైపు సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరా అమర్చారు. ఇక కెమెరా కంట్రోల్ బటన్తో చాలా సులభంగా ఫొటోలు, వీడియోలు తీసే అధునాతన ఫీచర్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే 128 స్టోరేజీతో కూడిన ఐఫోన్ 16 బేస్ మోడల్ ధర రూ. 79,900 (799 డాలర్లుగా), ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 (899 డాలర్లు) తో ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 16లో 'ఏఏఏ గేమ్స్' ఆడుకోవడానికి అవకాశం కల్పించారు. అంతకుముందు ప్రో మోడల్స్ మాత్రమే ఈ ఫీచర్ ఉండేది.

ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ ధరలు, ఫీచర్లు:

ఐఫోన్ 16 ప్రో డిస్ప్లే 6.3 అంగుళాలు, 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలతో ఇచ్చారు. ఈ రెండు మోడళ్లలో అడ్వాన్స్డ్ కూలింగ్ ఛాంబర్ ఫీచర్ ఉంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే క్రమంలో డివైజ్లు హీట్ కాకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ ప్రకటించింది. ప్రో, ప్రో మాక్స్ మోడళ్లలో ఏ18 ప్రో చిప్ వాడినట్లు యాపిల్ తెలిపింది. ప్రో రెస్ వీడియో రికార్డింగ్, ఫాస్టర్ యూఎస్బీ 3 ట్రాన్సఫర్ స్పీడ్లో ఈ చిప్ అడ్వాన్స్డ్ మీడియా సామర్థ్యాలను కలిగిఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఇక కెమెరా విషయానికి వస్తే వెనక వైపు రెండు 48 మెగాపిక్సెల్ కెమెరాలను వాడారు. ఒకటి 48 ఎంపీ ఫ్యూజన్ కెమెరా కాగా, మరొకటి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. 12 ఎంపీ 5X టెలిఫొటోతో ఫొటోలు తీయవచ్చు. ప్రో మోడళ్లలో 4k120 క్వాలిటీతో వీడియోలు రికార్డు చేయవచ్చు. ఇక కెమెరా కంట్రోల్ ఫీచర్తో హెడీఆర్ రికార్డింగ్ కు అవకాశం కల్పించారు. ఇక ధరల విషయానికి వస్తే 128 జీబీ స్టోరేజీ గల బేస్ మోడల్ 16 ప్రో ధర రూ. 1,19,900 (999 డాలర్లు), 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చే ప్రో 16 మాక్స్ రూ. 1,44,900 (1199 డాలర్లు) తో ఈ మోడళ్లు ప్రారంభమవుతాయి.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags