Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio: 8th Anniversary Offers – Check these Prepaid Plans with Benefits

 

Jio: 8th Anniversary Offers – Check these Prepaid Plans with Benefits

జియో: 8వ వార్షికోత్సవ ఆఫర్‌ – మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల తో పలు ప్ర యోజనాలు – వివరాలు ఇవే

=====================

జియో తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా కొన్ని రీఛార్జీలపై రూ.700 విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 10 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందుతారు.

జియో వార్షిక ప్రయోజనాల్లో భాగంగా రీఛార్జిలపై రూ.175 విలువైన వోచర్ అందిస్తోంది. ఈ వోచర్ కింద 28 రోజుల పాటు 10 ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు, 10జీబీ డేటా పొందొచ్చు. ఆఫర్లో భాగంగా మూడు నెలల పాటు ఉచితంగా జొమాటో గోల్డ్ మెంబర్షిప్ లభిస్తుంది. అదనంగా రూ.500 విలువైన అజియో వోచర్ కూడా ఇస్తామని జియో ప్రకటించింది. రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో అజియో వేదికగా కొనుగోలు చేసినప్పుడు అజియో కూపన్ వర్తిస్తుంది.

ప్లాన్ ల వివరాలు ఇవే:

జియో అందిస్తున్న రూ.899 త్రైమాసిక ప్లాన్ తో 90 రోజల వ్యాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు పొందొచ్చు. దీంతోపాటు 20జీబీ డేటా అదనం. 98 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చిన మరో ప్లాన్ ధర రూ.999. ఈ రీఛార్జిపై రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు. జియో అందిస్తున్న రూ.3,599 ప్లాన్ లో అపరిమిత కాలింగ్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, 2.5 జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

=====================

JIO APP

WEBSITE

===================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags