Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 16/10/2024

 

AP Cabinet Meeting Highlights – 16/10/2024 - Cabinet Approves New Industrial, MSME And Food Processing Policies

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 16/10/2024 - కొత్త పారిశ్రామిక, MSME మరియు ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలకు క్యాబినెట్ ఆమోదం

=====================

Press Conference by Hon'ble Chief Minister of Andhra Pradesh Sri. Nara Chandrababu Naidu at Conference Hall, Block-01, AP Secretariat on 16-10-2024 LIVE

LIVE - ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి " గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు" గారి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=d2eItQAeNTE

=====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మీడియాకు వివరించారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే: 

> ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

> థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు.

> “ఒకేసారి ఆరు కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలు తీసుకొచ్చాం. పర్యాటక, ఐటీ, వర్చువల్ వర్కింగ్ పాలసీలు తీసుకువస్తాం.

> 'వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదంతో వెళ్తున్నాం. ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయి. యువత భవిష్యత్తులో పెనుమార్పులు తెస్తాయి” అని సీఎం వివరించారు.

రాష్ట్రంలో ఐదుజోన్లలో ఇన్నోవేషన్ హబ్ లు:  

> "అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం. ఐదు జోన్లలో (విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ లేదా గుంటూరు, అనంతపురం) ఐదు ఇన్నోవేషన్ రతన్ టాటా హబ్లు వస్తాయి.

> ఆధునిక టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేస్తాం. కొత్త పాలసీలతో ఏపీలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ ఇన్నోవేషన్ హబ్ మారాలి.

> భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావాల్సి ఉంది. ఆదాయం పెంచి ప్రజలకు పంచాలన్నదే మా నినాదం. ఆక్వా కల్చర్ హబ్ ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఫుడ్ ప్రాసెసింగు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఫుడ్ హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ మారుతుంది.

> దేశంలో తొలిసారిగా పరిశ్రమల డీకార్బనైజేషనన్ ను ప్రోత్సహిస్తాం" అని సీఎం చంద్రబాబు తెలిపారు.

పెట్టుబడులు:  

> "జీరో బడ్జెట్, నేచురల్ ఫార్మింగ్: నవంబరు మొదటి వారంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తాం. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా మానుఫ్యాక్చరింగ్ హబ్ మారుస్తాం.

> ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్ వచ్చేలా మన ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్ తీర్చిదిద్దుతాం. గ్రీన్ ఎనర్జీ, నదుల అనుసంధానం, పోర్టులను కూడా అనుసంధానం చేస్తాం.

> 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు.. రూ.30లక్షల కోట్ల పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉత్పత్తి వ్యయం తగ్గేలా చర్యలు ఉంటాయి.

> విశాఖ నుంచి భావనపాడు వరకు రహదారి నిర్మిస్తాం. భావనపాడులో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం.

> ఉత్తరాంధ్రను కూడా పోర్టులు, టూరిజంతో అభివృద్ధి చెందేలా కార్యాచరణ.

> ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం” అని సీఎం తెలిపారు. 

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags