Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 23/10/2024

 

AP Cabinet Meeting Highlights – 23/10/2024

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 23/10/2024

=====================

Cabinet Decisions - Press Briefing by  Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing,  Sri. Kollu Ravindra, Hon'ble Minister for Mines & Geology, Excise,  Sri. Nadendla Manohar, Hon'ble Minister for Food and Civil Supplies Consumer Affairs,  Smt. Anitha Vangalapudi,  Hon'ble Minister for Home Affairs & Disaster Management, at Publicity Cell, Block - 04, AP Secretariat on 23-10-2024 LIVE, I&PR AP.

YouTube Link:

https://www.youtube.com/watch?v=0dOItqVlyvE

=====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:

1. ఉచిత గ్యాస్ సిలిండర్లు:

> దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

> నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్ లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు.

> ఒకేసారి మూడు సిలిండర్ లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు.

> ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.

2. ఉచిత ఇసుక విధానం:

> ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

> సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు.

> ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం. > పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

> ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

> ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు.

3. ఇతర కీలక నిర్ణయాలు:  

> ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

> విశాఖ శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags