Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Free LPG Cylinders (3) Per Year to the Eligible Beneficiaries – G.O. Released

 

AP: Free LPG Cylinders (3) Per Year to the Eligible Beneficiaries – G.O. Released

AP: అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఉచిత LPG సిలిండర్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

=======================

ఆంధ్ర లో సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గ్యాస్ పంపిణీ చేసిన 48 గంటల్లో ఆ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

'ఈ నెల 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒక దఫా సిలిండర్ పొందవచ్చు. 2025 ఏప్రిల్ 1 నుంచి ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ అందజేస్తాం. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించాం. రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. పట్టణ/నగరాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లోగా గ్యాస్ పంపిణీ జరుగుతుంది.

ఈ పథకం అమల్లో లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే 1967 (టోల్ ఫ్రీ నంబరు)కు ఫోన్ చేసి, పరిష్కరించుకోవచ్చు. పథకం అమలు కోసం 3 చమురు కంపెనీలతో మాట్లాడాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు' అని మంత్రి వివరించారు.

=======================

Consumer Affairs Food & Civil Supplies Department Supplying of (3) free LPG cylinders per year to the eligible beneficiaries - Orders - Issued.

CONSUMER AFFAIRS, FOOD & CIVIL SUPPLIES (CS-I) DEPARTMENT

G.O.Ms.No. 12, Dated 25.10.2024

=======================

DOWNLOAD G.O.12

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags