AP MEGA DSC Free Coaching 2024-25 for SW
& TW Departments – Details Here
ఏపీలో మెగా
డీఎస్సీ ఉచిత కోచింగ్ 2024-25 - సాంఘిక సంక్షేమ/
గిరిజన సంక్షేమ శాఖలు – వివరాలు ఇవే
====================
ఏపీలో ఉపాధ్యాయ
నియామక పరీక్ష 2024 (మెగా డీఎస్సీ) ఉచిత శిక్షణకు గాను సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ శాఖలు
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత
బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను ప్రభుత్వ కల్పించనుంది. అనుభవజ్ఞులైన బోధనా
సిబ్బందితో ఆయా జిల్లాల్లో మూడు నెలల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఎస్ఓటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఉంటుంది.
అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్
పోర్టల్ ద్వారా అక్టోబర్ 21వ తేదీలోగా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ 2024-25
సీట్లు:
మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050; ఎస్టీలకు 2,000 సీట్లు
కేటాయించారు. ఎంపికైన వారికి ఉచితంగా బోధన, భోజనం, వసతి సౌకర్యాలు అందుతాయి.
అర్హత:
ఎస్ఓటీ కోచింగ్ కు ఇంటర్, డీఈడీ, టెట్; స్కూల్ అసిస్టెంట్
కోచింగ్ కు డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, టెట్ స్కోరుకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 11-10-2024.
దరఖాస్తుకు
చివరి తేదీ: 21-10-2024.
హాల్‌టిక్కెట్
డౌన్లోడ్ తేదీలు: 22-10-2024 నుంచి 25-10-2024 వరకు.
స్క్రీనింగ్
టెస్ట్ తేదీ: 27-10-2024.
జిల్లాల
వారీగా మెరిట్ జాబితా వెల్లడి: 28-10-2024.
జిల్లాల
వారీగా తుది ఎంపిక జాబితా వెల్లడి: 30-10-2024.
శిక్షణ
కేంద్రాల వారీగా అభ్యర్థుల కేటాయింపు: 03-11-2024.
తరగతులు
ప్రారంభం: 11-11-2024.
====================
====================
0 Komentar