AP State Voters List Draft-2025 Released
– Details Here
ఏపీ: ఓటర్ల
ముసాయిదా జాబితా-2025 విడుదల – వివరాలు
ఇవే
=======================
ఏపీ లో ఓటర్ల
ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఉంచారు. సార్వత్రిక ఎన్నికల
నాటితో పోలిస్తే రాష్ట్రంలో 19,048 మంది ఓటర్లు పెరిగారు.
మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లు
ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది.
అందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ మేరకు
ముసాయిదా జాబితా విడుదల చేసింది.
నవంబరు 28వ తేదీ వరకూ ఈ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించనుంది. 2025 జనవరి 6న తుది జాబితా ప్రచురించనుంది. నవంబరు
9,
10, 23, 24 తేదీల్లో క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని
పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్ డేలు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాతో సహా బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు.
2025 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు కూడా ఓటుహక్కు
కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం
దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు.
ముసాయిదా
జాబితా ప్రకారం ముఖ్యాంశాలు:
> సాధారణ
ఓటర్లు: 4,13,53,792
> సర్వీసు
ఓటర్లు: 67,143
> మొత్తం
ఓటర్లు: 4,14,20,935 (పురుషులు: 2,03,47,738, మహిళలు: 2,10,69,803 థర్డ్
జెండర్ 3,394)
> 18-19 ఏళ్ల వయోవర్గానికి చెందినవారు: 4,86,226
> 6,13,970 మంది ఓటర్ల పెరుగుదల
> 2024 జనవరిలో తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ చేరిన కొత్త ఓటర్లు:
10,82,841 మంది.
> 2024 జనవరిలో తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ జాబితాలో నుంచి
తొలగించిన ఓటర్లు: 4,68,871
> 2024 జనవరిలో విడుదల చేసిన తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన
ముసాయిదా జాబితాలో నికర పెరుగుదల: 6,13,970 మంది.
> దివ్యాంగ
ఓటర్లు: 5,18,801
> రాష్ట్రంలోని
మొత్తం పోలింగ్ కేంద్రాలు: 46,397
> ఓటరు
జనాభా నిష్పత్తి: ప్రతి వెయ్యి మంది జనాభాకు 720 మంది ఓటర్లు.
=======================
=======================
0 Komentar