Firecracker Insurance: PhonePe Launches New
Plan for Diwali – Details Here
ఫోన్ పే నుంచి
టపాసుల బీమా - రూ.9 కి రూ.25 వేల వరకు కవరేజీ – వివరాలు ఇవే
====================
టపాసులు
కాల్చే క్రమంలో గాయపడే వారికి బీమా కల్పించే ఉద్దేశంతో ఫోన్ పే కొత్త బీమా పాలసీని
తీసుకొచ్చింది. ప్రమాదవశాత్తూ ఎవరైనా బాణసంచా వల్ల గాయపడితే వారికి ఈ బీమా అండగా
నిలుస్తుంది. రూ.9 చెల్లించడం ద్వారా
రూ.25
వేల వరకు కవరేజీ లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
అక్టోబర్ 25 నుంచి 10 రోజుల పాటు ఈ బీమా
కవరేజీ లభిస్తుందని ఫోన్ పే తెలిపింది. ఫోన్ యూజర్ తో పాటు భార్య పిల్లలు సహా
నలుగురు వ్యక్తుల వరకు సమగ్ర కవరేజీ కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్ 25 తర్వాత కొనుగోలు చేసిన వారికి పాలసీ ఆ రోజు నుంచే కవరేజీ
ప్రారంభం అవుతుంది.
దీపావళిని
దృష్టిలో పెట్టుకుని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి దీన్ని
తీసుకొచ్చినట్లు తెలిపింది. ఫోన్ పే లోని ఇన్సూరెన్స్ సెక్షన్ లో కి వెళ్లి 'ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్' ఎంపిక చేసుకుని వివరాలు ఇచ్చి పాలసీని కొనుగోలు చేయాలి.
====================
====================
0 Komentar