Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Flipkart Big Diwali Sale 2024: Dates Announced – Details Here

 

Flipkart 'Big Diwali Sale' 2024: Dates Announced – Details Here

ఫ్లిప్ కార్ట్ 'బిగ్ దీపావళి సేల్' 2024 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే

======================

ఫ్లిప్ కార్ట్ మరో సేల్ కు సిద్ధమైంది. ఇటీవల దసరా సందర్భంగా 'బిగ్ బిలియన్ డేస్' పేరిట ఆఫర్లు తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా 'బిగ్ దీపావళి సేల్‘ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ మొదలవుతుందని కంపెనీ తెలిపింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ లేదా వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందుగానే ఈ విండో తెరుచుకోనుంది.

దీపావళి సేల్ లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉండనున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఎంపిక చేసిన కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. దీపావళి సేల్లో అందిస్తున్న ఆఫర్లను తాజాగా తన వెబ్సైట్లో రివీల్ చేసింది. ఐఫోన్ 15 (iPhone 15) రూ.49,999కే లభించనుంది.

పాత తరం యాపిల్ ఎయిర్పాడ్స్ ఈ సేల్ లో రూ.9,999 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని తాజా డీల్స్ ను చూస్తే తెలుస్తోంది. ఇక యాపిల్ మ్యాక్స్ బుక్ ఎయిర్ ఎం2 పై రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత వరకు డిస్కౌంట్ ఉంటుందనే విషయాన్ని వెల్లడించలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎ23 రూ.37,999, గెలాక్సీ ఎస్23 ఎఫ్ఎస్ఈ రూ.29,249, ఐప్యాడ్ (2021) ధర రూ.20వేల కన్నా తక్కువకే కొనుగోలు చేయొచ్చని ఫ్లిప్కార్ట్ తన వెబ్సైట్లో పేర్కొంది.

======================

WEBSITE

ANDROID APP

iOS APP

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags