Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Diwali Offer 2024: Two New Prepaid Plans – Price and Benefit Details Here

 

Jio Diwali Offer 2024: Two New Prepaid Plans – Price and Benefit Details Here

జియో దీపావళి ఆఫర్ 2024: రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు – ధర మరియు బెనిఫిట్ వివరాలు ఇవే

=====================

జియో దీపావళి ధమాకా' ఆఫర్లను తీసుకొచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ఎంపిక చేసిన రీఛార్జీలపై రూ.3,350 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 3లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందుతారు.

దీపావళి ఆఫర్ లో భాగంగా రూ.899, రూ.3,599 రీఛార్జి ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను జియో అందిస్తోంది. ఆఫర్ ముగిసేలోగా ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే రూ.3,000 విలువ చేసే ఈజీ మై ట్రిప్ వోచర్ అందిస్తోంది. విమాన ప్రయాణాలు, హోటల్ బుకింగ్స్ చేసుకొనే వారు ఈ వోచర్ వినియోగించుకోవచ్చు. రూ.999 కంటే ఎక్కువ మొత్తంతో అజియో వేదికగా కొనుగోలు చేసినప్పుడు రూ.200 విలువైన అజియో కూపన్ వర్తిస్తుంది. రూ.150 విలువైన స్విగ్గీ వోచర్ కూడా ఈ ప్లాన్లతో ఇస్తోంది. 'మై జియో' యాప్ సాయంతో కూపన్లు క్లెయిమ్ చేసుకోవచ్చు.

జియో అందిస్తున్న రూ.899 త్రైమాసిక ప్లాన్ తో 90 రోజల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు పొందొచ్చు. జియో మరో ప్లాన్ రూ. 3,599 ప్లాన్ తో అపరిమిత కాలింగ్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, 2.5 జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.

=====================

MY JIO APP ANDROID

MY JIO APP iOS

PLANS DETAILS

=====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags