JioFinance New Mobile APP Launched – Details
Here
'జియో
ఫైనాన్స్' మొబైల్ యాప్: ఈ యాప్ తో డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు మరియు వివిధ ఆర్ధిక సేవలు – వివరాలు ఇవే
======================
జియో
ఫైనాన్షియల్ సర్వీసెస్ బీమా రంగంలో అడుగుపెట్టింది. 'జియో ఫైనాన్స్' పేరిట యాప్
ను ప్రవేశపెట్టినట్లు శుక్రవారం ప్రకటించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై
జియోలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
యూపీఐ
(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), డిజిటల్ బ్యాంకింగ్
సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా 'జియో
ఫైనాన్స్'
బీటా/ పైలట్ వెర్షన్ యాప్ ను ఈ ఏడాది మే 30నే లాంచ్
చేసింది. వినియోగదారుల నుంచి సూచనలు, సలహాల మేరకు
నేడు పూర్తిస్థాయి యాప్ ను అందరికీ
అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ స్టాక్ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. కేవలం 5 నిమిషాల్లో ఈ డిజిట్ సేవింగ్ ఖాతా తెరవచ్చని కంపెనీ
తెలిపింది. బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్
కార్డ్ తో సురక్షితమైన బ్యాంకు ఖాతాను పొందొచ్చని సంస్థ అధికారిక ప్రకటనలో
తెలిపింది.
ఈ యాప్ తో డిజిటల్
బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, బిల్లుల చెల్లింపు, బీమా
సలహాదారు వంటి సేవలు పొందొచ్చని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. మొబైల్
రీఛార్జ్,
క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించే సదుపాయం కూడా ఉంటుందని
ప్రకటించింది. జియో ఫైనాన్స్ యాప్ వినియోగదారులు వివిధ బ్యాంకు ఖాతాల్లో
హోల్డింగ్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వీక్షించే
అవకాశం కూడా కల్పిస్తోంది. అంతేకాదు 24 బీమా
ప్లాన్లను అందిస్తుంది.
జయో యాప్ లో ఉన్న
డేటా ప్రకారం.. మొబైల్ రీఛార్జీలపై ఇప్పటికే యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు ప్లాట్‌ఫామ్ ఫీజు
వసూలుచేస్తున్నాయి. అయితే జియో ఫైనాన్స్ యాప్ ద్వారా చేసే రీఛార్జీలపై ఎలాంటి ఫీ
ఉండబోదు. సులువుగా సేవింగ్ ఖాతా తెరవవచ్చు. యూపీఐ లావాదేవీలపై ఆకర్షించే రివార్డు
పాయింట్లు ఇవ్వనుంది. మ్యూచువల్ ఫండ్లపై రుణం తీసుకోవచ్చు. సులువగా చాట్ చేసి లోన్
అప్రూవల్ పొందొచ్చు. మరో సదుపాయం ఏంటంటే జియో ఫైనాన్స్ అందించే సదుపాయాల్ని ఏ
సిన్కార్డ్ సాయంతో నైనా పొందొచ్చు.
======================
======================
The wait is over! 🥳
— JioFinance (@JioFinance1) October 11, 2024
The JioFinance App is now fully launched! Whether you're Gen Z, Millennial, or Gen X, enjoy seamless transactions, secure loans, insurance & more.
Discover finance made for you: https://t.co/KIt0cuCWng#JioFinance #JioFinanceApp #GenAll pic.twitter.com/Wkatw00DVG
0 Komentar