Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NICL Recruitment 2024: Apply for 500 Assistant Posts – Details Here

 

NICL Recruitment 2024: Apply for 500 Assistant Posts – Details Here

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.22,405- రూ.62,265.

=====================

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం... దేశవ్యాప్తంగా ఎన్ఐసీఎల్ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

అసిస్టెంట్ (క్లాస్-III కేడర్): 500 (ఎస్సీ- 43; ఎస్టీ- 33; ఓబీసీ- 113; ఈడబ్ల్యూఎస్- 41; యూఆర్ - 270)

ఆంధ్రప్రదేశ్ లో 21, తెలంగాణ రాష్ట్రంలో 12 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం అవసరం.

వయస్సు: 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.22,405- రూ.62,265.

ఎంపిక విధానం: ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ (30 ప్రశ్నలు - 30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు).

ప్రశ్నల సంఖ్య: 100. మొత్తం మార్కులు 100.

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.

మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్) సబ్జెక్టులు: టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు)

ప్రశ్నల సంఖ్య: 200. మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి: 120 నిమిషాలు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్ / రంగారెడ్డి, వరంగల్.

తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు: హైదరాబాద్.

దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్సెసర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.100. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 24/10/2024.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 11/11/2024.

ఫేజ్-I ఆన్లైన్ పరీక్ష తేదీ: 30/11/2024.

ఫేజ్-II ఆన్లైన్ పరీక్ష తేదీ: 28/12/2024.

=====================

NOTIFICAITON

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags