Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PM Internship Scheme 2024 – All the Details Here

 

PM Internship Scheme 2024 – All the Details Here

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2024 – పూర్తి వివరాలు ఇవే

==================

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం (అక్టోబర్ 12) ప్రారంభమైంది. మన దేశంలోని 500 అగ్రగామి కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్ షిప్ చేసేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. దానివల్ల అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉపాధి పొందడం సులవవుతుంది.

ఆన్లైన్ పోర్టల్లో ఈ ఇంటర్న్షిప్ కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంపికైనవారికి 12 నెలలపాటు రూ.5 వేల చొప్పున అందిస్తారు. ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారు. ఇంటర్న్ షిప్ లు  డిసెంబరు 2న ప్రారంభమవుతాయి. 21-24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు.

==================

WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags