King Of Clay Rafael Nadal Announces Retirement
from Tennis with 22 Grand Slam Titles
రిటైర్మెంట్ ని
ప్రకటించిన 'క్లే కోర్టు' రారాజు రాఫెల్ నాదల్ – మొత్తం 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో టెన్నిస్‌కు వీడ్కోలు
=====================
దిగ్గజ టెన్నిస్
ఆటగాడు రఫెల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్
లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఆటకు
వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. "నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్
అవుతున్నాను. గత రెండేళ్లు కఠినంగా గడిచాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం
పట్టింది. కానీ, జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు అనేది ఉంటుంది" అని నాదల్ పేర్కొన్నాడు. కొంత
కాలంగా గాయాలతో సతమతమవుతున్న ఈ టెన్నిస్ దిగ్గజం గత నెలలో జరిగిన లేవర్ కప్ నుంచి
తప్పుకొన్నాడు. 38 ఏళ్ల నాదల్ చివరగా
పారిస్ ఒలింపిక్స్ లో ఆడాడు. సింగిల్స్లో రెండో రౌండ్లోనే జకోవిచ్ చేతిలో ఓడాడు.
డబుల్స్లో అల్కరాస్ తో కలిసి క్వార్టర్స్ వరకూ వెళ్లాడు.
'మట్టి కోర్టు రారాజు’గా వెలుగొందిన నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్ లో జన్మించాడు. 2001లో అంతర్జాతీయ టెన్నిస్ లోకి ప్రవేశించాడు. మరో నాలుగు సంవత్సరాలకే తొలి టైటిల్ (2005- ఫ్రెంచ్ ఓపెన్)ను తన ఖాతాలో వేసుకొని ఒక్కసారిగా క్రీడాలోకాన్ని తనవైపు చూసేట్లు చేశాడు. ఈ స్పెయిన్ బుల్ తన కెరీర్లో ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉండటం విశేషం. ఎర్ర మట్టి రారాజు నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. రొలాండ్ గారోస్ లో సోదర్లింగ్, జకోవిచ్ తర్వాత రఫాను ఓడించింది జ్వెరెవ్ మాత్రమే. చివరిగా 2022లో రఫా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు.
=====================
నాదల్
గెలిచిన గ్రాండ్ స్లామ్ వివరాలు:
1. ఆస్ట్రేలియన్ ఓపెన్
(2):
2009, 2022.
2. ఫ్రెంచ్ ఓపెన్ (14): 2005,
2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018,
2019, 2020, 2022.
3. వింబుల్డెన్
(2):
2008, 2010
4. యూఎస్
ఓపెన్ (4): 2010, 2013, 2017, 2019
=====================
0 Komentar