Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG DSC-2024: 8 Member Selected as Govt Teachers from Same Village – Details Here

 

TG DSC-2024: 8 Member Selected as Govt Teachers from Same Village – Details Here

ఒకే గ్రామం నుంచి 8 మంది డీఎస్సీ-2024 తో ఉపాధ్యాయులుగా ఎంపిక - నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు – వివరాలు ఇవే

======================

ఒకేసారి ఒక గ్రామం నుండి నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు (మొత్తం 8 మంది) ఉపాధ్యాయ నియామాక పత్రాలను అందుకున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఎంపిక నియామక పత్రాలు అందుకున్నారు.

గ్రామస్థుల సన్మానం:  

తమ గ్రామం నుంచి ఒకేసారి ఎనిమిది మందికి టీచర్ ఉద్యోగాలు రావడంతో దసరా పండుగ వేళ వారి సంబరం మరింత పెరిగింది. తమ ఊరికి ఇంత పేరు తీసుకొచ్చిన 8 మంది ఉపాధ్యాయులను, వారి తల్లిదండ్రులను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

గత పది సంవత్సరాలుగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూశామని నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని శ్రమించామని, తమ కష్టానికి ఫలితంగా ఎనిమిది మందికి ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయ విజేతలు అన్నారు. మా తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రోత్సాహం మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు. అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే చిన్నారులను ఉత్తమమైన విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

"నేను గత పదేళ్లుగా టీచర్ జాబ్కోసం ప్రయత్నిస్తున్నాను. 2017లో ఒకసారి పరీక్షకు హాజరైనప్పటీకీ ఉద్యోగం సాధించలేకపోయాను. ఈ సారి మరింత పట్టుదలతో చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం జరిగింది. నా విజయంలో గ్రామస్థులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది. ఇక్కడితో ఆగకుండా గ్రూప్-2, గ్రూప్-1 లాంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతాను". 

- మహేష్‌, ఉపాధ్యాయుడు

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags