Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2024: Victor Ambros & Gary Ruvkun Wins Nobel Prize in Medicine for their Work in micro-RNA

 

The Nobel Prize 2024: Victor Ambros & Gary Ruvkun Wins Nobel Prize in Medicine for their Work in micro-RNA

నోబెల్ ప్రైజ్ 2024: మైక్రో ఆర్ఎన్ఏ గురించి కృషికి గాను విక్టర్ ఆంబ్రోస్ & గ్యారీ రవున్ ల కు ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి

=======================

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవున్ లకు వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం లభించింది. స్వీడన్ లోని స్టాక్హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. వీరిద్దరూ అమెరికాకు చెందినవారే కావడం విశేషం.

కొవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరి అమెరికన్ కాటలిన్ కరికో అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్ లకు గతేడాది వైద్యశాస్త్రంలో నోబెల్ వచ్చింది. వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.

వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 14న అర్ధశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.



స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags