The Nobel Prize 2024: Japanese Organisation
Nihan Hidankyo Wins Nobel Peace Prize – Details Here
నోబెల్
ప్రైజ్ 2024:
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి అందుకున్న జపనీస్ సంస్థ నిహాన్
హిడాంక్యో – కారణం ఇదే
=================
నోబెల్ శాంతి
బహుమతి - 2024 జపాన్ కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్ లోని హిరోషిమా, నాగసాకిల్లో
అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధ
రహితంగా మార్చేందుకు కృషి చేస్తుండడంతోపాటు బాధితుల జీవితగాథల్ని ఉదహరిస్తూ
మరోసారి అణ్వాయుధాలను వాడకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు ఈ ప్రతిష్టాత్మక
పురస్కారం దక్కింది.
"హిరోషిమా, నాగసాకి అణుబాంబు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు శారీరక సమస్యలు, విషాద జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ వారిని గౌరవించాలని భావిస్తున్నాం. శాంతి, విశ్వాసం పెంపొందించడానికి వారి విలువైన అనుభవాలను ఉపయోగించుకునేందుకు శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించాం' అని నోబెల్ బృందం పేర్కొంది. జపాన్ నగరాల్లో అణ్వాయుధాల బారిన పడిన బాధితుల ఉద్యమాన్ని హిబాకుషా (Hibakusha)గా పేర్కొంటారు. దీనిలో జపాను చెందిన 47 రాష్ట్రాల్లో పోరాడుతున్న సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
One day, the atomic bomb survivors from Hiroshima and Nagasaki will no longer be among us as witnesses to history.
— The Nobel Prize (@NobelPrize) October 11, 2024
But with a strong culture of remembrance and continued commitment, new generations in Japan are carrying forward the experience and the message of the witnesses.… pic.twitter.com/8ZuDO7NwyE
మరోవైపు, వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలతోపాటు సాహిత్యంలో
నోబెల్ గ్రహీతల పేర్లను ఇప్పటికే వెల్లడించగా.. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace
Prize 2024)ని ప్రకటించారు. అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
=================
0 Komentar