Yantra India Recruitment 2024: Apply for
3883 Trade Apprentice Posts – Details Here
యంత్ర ఇండియా
లిమిటెడ్ లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే
======================
యంత్ర ఇండియా
లిమిటెడ్. . . దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్
విడుదలైంది. ఐటీఐ, నాన్ ఐటీఐ
అభ్యర్థులకు సంబంధించి మొత్తం 3,883 ఖాళీలున్నాయి.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో
అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.
ఖాళీల
వివరాలు:
ట్రేడ్
అప్రెంటిస్: 3,883 ఖాళీలు
(ఐటీఐకు
సంబంధించి 2498; నాన్ ఐటీఐకు సంబంధించి 1385 ఖాళీలు ఉన్నాయి)
ట్రేడులు:
మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్
అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్
తదితరాలు.
అర్హత: ఐటీఐ
కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం; నాన్-ఐటీఐ
కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో
ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
స్టైపెండ్:
నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
ఎంపిక
ప్రక్రియ: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ
కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన
మార్కులు,
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ . 200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్
అభ్యర్థులకు రూ.100).
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22.10.2024.
ఆన్లైన్
దరఖాస్తులకి చివరి తేదీ: 21.11.2024.
======================
======================
0 Komentar