AP Schools: Update
on Teachers Transfers & Promotions, Mega PTM, Summative Exam Dates &
Change in School Categories
ఏపీ పాఠశాలల అప్డేట్:
ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్, మెగా
PTM, సమ్మేటివ్ పరీక్షల తేదీలు & పాఠశాల
కేటగిరీలలో మార్పుల గురించి అప్డేట్ లు ఇవే
=====================
నవంబర్ 15 (శుక్రవారం) ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం నిర్వహించిన
సమావేశంలో డైరెక్టర్ విజయరామరాజు పలు కీలక అంశాలను వెల్లడించారు.
1. ఉపాధ్యాయుల
బదిలీలు-2025: ఏప్రిల్ 10 నుంచి టీచర్ల
బదిలీలు:
మొదటి విడతగా
డిసెంబరు 20 వరకు ఉపాధ్యాయుల ప్రొఫైల్
నవీకరిస్తారు. రెండో విడత జనవరి 20, మూడో విడత ఫిబ్రవరి 10 వరకు అవకాశం కల్పిస్తారు. ఈ టీచర్ ప్రొఫైల్స్ ను అనుసరించే
సీనియారిటీ జాబితా సిద్ధమవుతుంది.
బదిలీలు:
బదిలీల చట్టం
అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీలు చేపడతారు. ప్రధానోపాధ్యాయులకు ఏప్రిల్ 10 నుంచి 15 వరకు, స్కూల్ అసిస్టెంట్లకు ఏప్రిల్ 21 నుంచి 25 వరకు, ఎస్జీటీలకు మే ఒకటి నుంచి 10 వరకు ఉంటాయి.
పదోన్నతులకు
సంబంధించి సీనియారిటీ జాబితాలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు
ప్రదర్శిస్తారు. ఈ పదోన్నతులు, బదిలీలు
పూర్తికాగానే డీఎస్సీలో ఎంపికైన వారికి మే 11 నుంచి 30 వరకు పోస్టింగ్ లు ఇస్తారు.
పదోన్నతులకు
సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను మెరిట్ కం రోస్టర్ విధానంలో
తయారు చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం పదోన్నతులు, బదిలీలు
నిర్వహిస్తుంది.
2. బదిలీల
చట్టం:
ఉపాధ్యాయుల
బదిలీలకు చట్టం తీసుకురానుంది. ఏటా మే 31నాటికి ఉన్న
ఖాళీలను పరిగణనలోకి తీసుకొని బదిలీలు నిర్వహిస్తుంది. జూన్ 1న పాఠశాలల్లో చేరేలా ఉత్తర్వులు ఇస్తుంది.
ప్రధానోపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా
ఐదేళ్లు,
ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా 8ఏళ్ల
సర్వీసును బదిలీలకు పరిగణనలోకి తీసుకుంటుంది. హెచ్ఎస్ఏ 16% ఉన్న వాటిని కేటగిరి-ఎ, 12% వాటిని కేటగిరి-బి, 10% ఉంటే కేటగిరి-సి, 5వేల కంటే తక్కువ జనాభా ఉంటే కేటగిరి-డీగా నిర్ణయిస్తుంది.
కేటగిరి-ఏకు ఒక పాయింటు, కేటగిరి-బీకి 2, కేటగిరి- సీకి 3పాయింట్లు,కేటగిరి-డీకి 4 పాయింట్లు
చొప్పున బదిలీల సమయంలో కేటాయిస్తుంది.
3. Mega PTM:
డిసెంబరు 5న టీచర్లు, విద్యార్థుల
తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబరులోనే ఉపాధ్యాయ
సంఘాల నాయకులతో టీచర్ల బదిలీల చట్టం ముసాయిదాపై విద్యాశాఖ మంత్రి లోకేష్
మాట్లాడుతారు. అంతేకాదు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్‌పైనా చర్చించనున్నారు.
4. ఆదర్శ
ప్రాథమిక బడుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు - బేసిక్ కేటగిరీలో 20మంది వరకు ఒక టీచర్
రాష్ట్రంలో
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రెండు రకాల ప్రాథమిక పాఠశాలలను
నిర్వహించనుంది. ఒకటి బేసిక్ ప్రాథమిక పాఠశాల కాగా.. మరొకటి ఆదర్శ పాఠశాల ఉంటుంది.
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ తయారుచేసేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్, కార్యదర్శి త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
> బేసిక్
ప్రాథమిక పాఠశాలలో 20 మందిలోపు పిల్లల
వరకు ప్రభుత్వం ఒక ఎస్జీటీని కేటాయిస్తుంది. 60మంది వరకు
పిల్లలు ఉంటే రెండు ఎస్జీటీ పోస్టులు ఉంటాయి. ఆపైన ప్రతి 30మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీ పోస్టు చొప్పున
కేటాయిస్తుంది. ఇవి ఆదర్శ పాఠశాలలు నిర్వహించడం కష్టతరమైన ప్రాంతాల్లోనే ఉంటాయి.
> ఆదర్శ
ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఎస్జీటీని ఇస్తుంది. 120 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న పాఠశాలకు
ప్రధానోపాధ్యాయుడిని కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు 1:30, ఉన్నత పాఠశాలలకు 1:35 నిష్పత్తిలో ఉపాధ్యాయులను ఇస్తుంది. ఆదర్శ పాఠశాలను ప్రతి పంచాయతీకి ఒకటి
చొప్పున ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
5. ప్రాథమికోన్నత
పాఠశాలల గురించి:
రాష్ట్రంలో
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల విధానం ఉండదు. ప్రాథమికోన్నత
బడుల్లో 6,7,8 తరగతుల్లో 30మంది కంటే
తక్కువ ఉంటే వాటిని ప్రాథమిక పాఠశాలలుగా మార్చేస్తుంది. 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తుంది.
> జీఓ-117 రద్దు, బదిలీల చట్టంపై
ప్రతిపాదనలను ఈనెల 30న ప్రభుత్వానికి
డైరెక్టరేట్ నుంచి పంపిస్తారు.
> సమ్మెటివ్-1
పరీక్షలు డిసెంబరు 9 నుంచి 14 వరకు ఉంటాయి.
=====================
0 Komentar