CBSE - Single Gild Child Scholarship 2024
– Details Here
సీబీఎస్ఈ -
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే
=====================
తల్లిదండ్రులకు
ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్
సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ఏటా అందిస్తోంది. ఇందుకు సంబంధించి
సీబీఎస్ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 ప్రకటన వెలువడింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల
నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
సీబీఎస్ఈ-
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024:
అర్హతలు:
విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్ఈలో
పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ
పాఠశాలలో పదకొండవ తరగతి, పన్నెండో తరగతి
చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70శాతం
మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.3000 కంటే మించకూడదు.
స్కాలర్షిప్
వివరాలు: ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి
తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవాలంటే, విద్యార్థిని కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 22-11-2024.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది: 23-12-2024.
సీబీఎస్ఈ
పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీలు: 25.11.2024 నుంచి 24.12.2024 వరకు
======================
GUIDELINES
FOR FRESH APPLICATION
GUIDELINES
FOR RENEWAL APPLICATION
=====================
0 Komentar