Honda Activa Electric and QC1 Launched –
All the Details Here
హోండా కంపెనీ
నుండి యాక్టివా ఎలక్ట్రిక్ మరియు క్యూసీ1 పేర్లతో రెండు ఎలెక్టిక్ స్కూటర్లు విడుదల
– ఫీచర్ల వివరాలు ఇవే
======================
హోండా కంపెనీ
బుధవారం (నవంబర్ 27) న యాక్టివా ఇ, క్యూసీ1 పేరుతో రెండు విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించింది. జనవరి 1 నుంచి ఈ స్కూటర్లకు బుకింగ్లు మొదలవుతాయని, ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని హెచ్ఎంఎస్ఐ
వెల్లడించింది. ఈ స్కూటర్ల ధరలను మాత్రం సంస్థ బహిర్గతం చేయలేదు.
Activa e:
> యాక్టివా
ఇ స్కూటర్ స్వాపబుల్ (ఛార్జింగ్ కోసం బయటకు తీసే వీలున్న) బ్యాటరీతో వస్తుండగా..
క్యూసీ1
ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తోంది. యాక్టివా ఇ స్కూటర్లో రెండు 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీలను అమర్చారు. సింగిల్ ఛార్జింగ్ తో 102 కి. మీ. ప్రయాణించొచ్చు. గరిష్ఠ వేగం 80 కి.మీ. స్టాండర్డ్, స్పోర్ట్, ఎకానమీ పేరుతో మూడు రైడింగ్ మోడ్లు ఉంటాయని కంపెనీ
తెలిపింది. ప్రస్తుత యాక్టివా డిజైన్లో ఎల్రడీ హెడ్ల్యాంప్, సైడ్ ఇండికేటర్ల విషయంలో చిన్న మార్పులతో యాక్టివా ఇ
స్కూటర్ ని రూపొందించారు.
QC1:
> హోండా
క్యూసీ 1ను భారత విపణి కోసం ప్రత్యేకంగా సంస్థ తీసుకొచ్చింది.
తక్కువ దూరం ప్రయాణాల కోసం దీన్ని రూపొందించారు. యాక్టివా తరహాలో ఉన్నా ఇందులో
ఎల్ఎస్ఈడీ డీఆర్ఎల్న ఇవ్వలేదు. ఇందులో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ను ఫిక్స్డ్ అమర్చారు. ఒకసారి ఛార్జింగ్తో 80 కి.మీ. ప్రయాణిస్తుంది. గరిష్ఠ వేగం 50 కి.మీ. 5 అంగుళాల ఎల్సీడీ
ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్, యూఎస్బీ టైప్-సి
పోర్ట్ వంటి ఫీచర్లు దీనికి ఉన్నాయి.
======================
======================
0 Komentar