IDBI Recruitment 2024: Apply for 600 JAM
& AAO Posts - Details Here
ఐడీబీఐ
బ్యాంకులో 600 జూనియర్ అసిస్టెంట్
మేనేజర్ & అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏఓ) స్పెషలిస్ట్
పోస్టులు - పే స్కేల్: ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 వరకు
=====================
ఐడీబీఐ
బ్యాంకు 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ
మేరకు నోటిఫికేషన్ వెలువడింది.
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఒ' జనరల్: 500 పోస్టులు
2. అగ్రి అసెట్ ఆఫీసర్ (ఏఏఓ) స్పెషలిస్ట్: 100 పోస్టులు
అర్హతలు:
గ్రేడ్ 'ఒ'- జనరల్ పోస్టులకు
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ; గ్రేడ్ 'ఒ'- స్పెషలిస్ట్
పోస్టులకు బీఎస్సీ/ బీటెక్/ బీఈ (అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిషరీస్ సైన్స్/ ఇంజినీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/ టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్)
ఉత్తీర్ణత అవసరం. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు
కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు కంప్యూటర్ ఐటీ సంబంధిత
అంశాల్లో ప్రావీణ్యం తప్పనిసరి.
వయస్సు: 01.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు
పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.
పే స్కేల్:
ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/
పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాలి.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు
ప్రారంభం: 21-11-2024.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2024.
=====================
=====================
0 Komentar