IPL Mega Auction
2025: List of Retained Players and Auction Live - Details Here
ఐపీఎల్ మెగా
వేలం 2025: వేలం ముందు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల
జాబితా ఇదే – వేలం ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే
======================
======================
ఇండియన్
ప్రీమియర్ లీగ్ (IPL Mega Auction 2025) ఈ ఆది, సోమవారాల్లో (నవంబర్ 24 & 25) మెగా వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీపడనున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లను
మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. కనీస ధర రూ. 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది
ఆటగాళ్లున్నారు. పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి కెప్టెన్లు ఉండడంతో.. ప్రతి
మూడేళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. 2025 ఐపీఎల్ మార్చి 14న
ఆరంభమవుతుంది. మే 25న ఫైనల్.
ఐపీఎల్ వేలం
మధ్యాహ్నం 3.30కు మొదలవుతుంది.
స్టార్ స్పోర్ట్స్ (హాట్ స్టార్ట్) మరియు జియో సినిమా లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
ఈ మేరకు ఏ
ఫ్రాంఛైజీ ఎంతమందిని రిటైన్ చేసుకున్నాయి? ఎంత మొత్తం
చెల్లించి రిటైన్ చేసుకున్నాయి? ఇంకా ఎంత మొత్తం వేలం
కి మిగిలిందో ఒక సారి చూడవచ్చు.
1. సన్
రైజర్స్ హైదరాబాద్ (SRH):
సన్ రైజర్స్
హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది.
1. హెన్రిచ్
క్లాసెన్‌కు (రూ.23 కోట్లు).
2. ప్యాట్
కమిన్స్ (రూ.18 కోట్లు),
3. అభిషేక్
శర్మ (రూ.14 కోట్లు),
4. ట్రావిస్
హెడ్ (రూ.14 కోట్లు),
5. నితీశ్
రెడ్డి (రూ.6కోట్లు).
2. చెన్నై
సూపర్ కింగ్స్ (CSK):
టీమిండియా
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ 2025 ఆడనున్నాడు. ఈ మేరకు ఆ జట్టు ప్రకటించిన రిటెన్షన్ లిస్ట్‌లో ధోనీ అన్‌క్యాప్డ్
ప్లేయర్‌గా రూ.4 కోట్లకు రిటైన్ అయ్యాడు. మొత్తంగా
సీఎస్కే ఐదుగుర్ని రిటైన్ చేసుకుంది.
1. మహేంద్ర
సింగ్ ధోనీ (రూ.4 కోట్లు)
2. రుతురాజ్
గైక్వాడ్ (రూ.18 కోట్లు),
3. రవీంద్ర
జడేజా (రూ.18 కోట్లు),
4. మతీశ
పథిరన (రూ.13 కోట్లు),
5. శివమ్
దూబే (రూ.12 కోట్లు)
3. ముంబై
ఇండియన్స్ (MI):
ముంబై
ఇండియన్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025లో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు.
1. బుమ్రా
(18 కోట్లు)
2. సూర్యకుమార్
యాదవ్ (రూ.16.35 కోట్లు),
3. హార్దిక్
పాండ్యాల (రూ.16.35 కోట్లు)
4. రోహిత్
శర్మ 16.30 కోట్లు,
5. తిలక్
వర్మ (రూ.8 కోట్లు)
4. రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు (RCB):
రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఐపీఎల్
మెగా వేలానికి ముందు అత్యధిక మొత్తంతో రిటైన్ అయిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే.
1. విరాట్
కోహ్లీ (రూ.21 కోట్లు),
2. రజత్
పటీదార్ (రూ.11 కోట్లు),
3. యశ్
దయాళ్ (రూ.5 కోట్లు).
5. కోల్కతా
నైట్ రైడర్స్ (KKR):
డిఫెండింగ్
ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసింది.
మొత్తంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది.
1. రింకూ
సింగ్ (రూ.13 కోట్లు)
2. వరుణ్
చక్రవర్తి (రూ.12 కోట్లు)
3. సునీల్
నరైన్ (రూ.12 కోట్లు)
4. ఆండ్రీ
రస్సెల్ (రూ.12 కోట్లు),
5. హర్షిత్
రాణా (రూ.4 కోట్లు),
6. రమణ్
దీప్ సింగ్ (రూ.4 కోట్లు).
6. ఢిల్లీ
క్యాపిటల్స్ (DC):
ఢిల్లీ
క్యాపిటల్స్ జట్టు రిషభ్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది. నలుగురు ప్లేయర్లను రిటైన్
చేసుకుంది.
1. అక్షర్
పటేల్ (రూ.16.5 కోట్లు)
2. కుల్‌దీప్
యాదవ్ (రూ.13.25 కోట్లు),
3. ట్రిస్టన్
స్టబ్స్ (రూ.10 కోట్లు,
4. అభిషేక్
పోరెల్ (రూ.4 కోట్లు).
7. పంజాబ్
కింగ్స్ (PBKS):
వేలానికి
ముందు పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్‌ను తన వెంట ఉంచుకుంది. కేవలం ఇద్దరు ఆటగాళ్లను
మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరూ కూడా
అన్‌క్యాప్డ్ ఆటగాళ్లే కావడం గమనార్హం.
1. శశాంక్
సింగ్ (రూ.5.5 కోట్లు),
2. ప్రభుసిమ్రాన్
సింగ్ (రూ.4 కోట్లు).
8. రాజస్థాన్
రాయల్స్ (RR):
రాజస్థాన్
రాయల్స్ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది.
1. సంజూ
శాంసన్ (రూ.18 కోట్లు),
2. యశస్వి
జైశ్వాల్ (రూ.18 కోట్లు)
3. రియాన్
పరాగ్ (రూ.14 కోట్లు),
4. ధ్రువ్
జురెల్ (రూ.14 కో ట్లు),
5. షిమ్రాన్
హిట్‌మెయర్ (రూ.11 కోట్లు),
6. సందీప్
శర్మకు (రూ.4 కోట్లు).
9. లక్నో
సూపర్ జెయింట్స్ (LSG):
కెప్టెన్
కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ విడిచిపెట్టింది. మొత్తంగా ఐదుగురు
ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
1. నికోలస్
పూరన్‌ను (రూ.21 కోట్లు)
2. రవి
బిష్ణోయ్ (రూ.11 కోట్లు),
3. మయాంక్
యాదవ్ (రూ.11 కోట్లు)
4. మోసిన్
ఖాన్ (రూ.4 కోట్లు)
5. ఆయుష్
బదోనీ (రూ.4 కోట్లు).
10. గుజరాత్
టైటాన్స్ (GT):
ఐదుగురు
ఆటగాళ్లను గుజరాత్ రిటైన్ చేసుకుంది.
1. రషీద్
ఖాన్ (రూ.18 కోట్లు)
2. శుభ్మన్
గిల్ (రూ.16.5 కోట్లు)
3. సాయి
సుదర్శన్ (రూ.8.5 కోట్లు)
4. రాహుల్
తెవాటియా (రూ.4 కోట్లు)
5. షారుఖ్
ఖాన్ (రూ.4 కోట్లు).
======================
0 Komentar