Bank of Baroda Launched a New ‘Tiara Credit
Card’ for Women – Details Here
మహిళల కొరకు ప్రత్యేకంగా
బ్యాంక్ ఆఫ్ బరోడా ‘తియారా’ పేరిట కొత్త క్రెడిట్ కార్డు – ఫీచర్లు మరియు ప్రయోజనాల
వివరాలు ఇవే
======================
బ్యాంక్ ఆఫ్
బరోడా కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. మహిళల కోసం ప్రత్యేకంగా తియారా
పేరిట ఈ కార్డును (TIARA Credit Card) తీసుకొచ్చింది.
ట్రావెల్,
డైనింగ్, లైఫ్ స్టయిల్
కేటగిరీకి సంబంధించి పలు ప్రయోజనాలతో పాటు రివార్డు పాయింట్లూ అందిస్తోంది. రూపే
నెట్వర్క్ పై ఈ క్రెడిట్ కార్డు పని చేస్తోంది.
తియారా
క్రెడిట్ కార్డు హోల్డర్లకు.. మింత్రా, నైకా, ఫ్లిప్కార్ట్, లాక్మే సలోన్, అర్బన్ కంపెనీకి వోచర్లు ఉచితంగా లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాటార్, గానా ప్లస్
మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు. సినిమా టికెట్ల బుకింగ్ పైన డిస్కౌంట్లు పొందొచ్చు.
మొత్తంగా వోచర్లు, మెంబర్షిప్లు కలిపి
రూ.31
వేలు ప్రయోజనాలను అందిస్తున్నట్లు బీఓబీ కార్డ్ లిమిటెడ్
తెలిపింది.
ఈ కార్డు
పొందాలంటే జాయినింగ్ ఫీజు రూ. 2,499+ జీఎస్టీ
చెల్లించాలి. వార్షిక రుసుము కూడా ఇంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కార్డు
పొందిన 60
రోజుల్లో రూ. 25 వేలు లావాదేవీలు జరిపితే జాయినింగ్ ఫీజును వాపస్ చేస్తారు. ఏడాదిలో రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుమును కూడా రద్దు చేస్తారు.
క్రెడిట్ కార్డ్
ఫీచర్ల వివరాలు ఇవే:
> ట్రావెల్, డైనింగ్, ఇంటర్నేషనల్
కొనుగోళ్లపై ప్రతీ రూ.100కు 15 రివార్డు పాయింట్లు.
> ఇతర లావాదేవీలపై ప్రతీ రూ.100కు 3 రివార్డు పాయింట్లు (ఒక రివార్డు పాయింట్ = 25 పైసలు).
> ప్రతీ
బిల్లింగ్ సైకిల్లో రూ.500 వరకు యూపీఐ
చెల్లింపులకు మాత్రమే రివార్డు పాయింట్లు కేటాయింపు.
> ప్రతీ
త్రైమాసికంలో రూ.500 విలువైన నైకా, మింత్రా, ఫ్లిప్కార్ట్
డిస్కౌంట్ వోచర్లు, రూ.1500 విలువ చేసే లాక్మే సలోన్ వోచర్ ఫ్రీ
> అమెజాన్
ప్రైమ్, డిస్నీప్లస్ హాట్ స్టార్, గానా ప్లస్ వార్షిక సబ్స్క్రిప్షన్ ఉచితం.
> బుక్
మై షోలో మూవీ టికెట్ బుకింగ్లపై రూ.250 డిస్కౌంట్ (త్రైమాసికానికోసారి మాత్రమే) సంవత్సరంలో 3 నెలల పాటు స్విగ్గీ వన్ మెంబర్షిప్.
> రూ.250 విలువ చేసే బిగ్ బాస్కెట్ డిస్కౌంట్ వోచర్ (త్రైమాసికానికి
ఒకటి).
> వీటితో
పాటు హెల్త్ ప్యాకేజీ, రూ.10లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, దేశీయ విమాన ప్రయాణాలకు అపరిమిత లాంజ్ సదుపాయం, ఫ్యూయల్ సర్చార్జి రద్దు వంటి సదుపాయాలతో ఈ కార్డును
తీసుకొచ్చారు.
======================
======================
0 Komentar