Centre Scraps 'No-Detention' Policy for
Classes 5 And 8 Students Failing Year-End Exams – Details Here
'నో-డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసిన కేంద్రం – వివరాలు ఇవే
=====================
కేంద్ర
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో
నో డిటెన్షన్ విధానాన్ని (No-detention policy) రద్దు చేసింది. దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతిలో చదవాల్సిఉంటుంది.
విద్యాహక్కు చట్టం- 2019కు చేసిన సవరణ
ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు (తెలుగు
రాష్ట్రాలు మినహా), రెండు కేంద్రపాలిత
ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం
పేర్కొంది.
పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ రీ-ఎగ్జామ్ లోను ఫెయిల్ అయితే.. సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
The Union Education Ministry has taken a big decision and abolished the 'No Detention Policy'.
— DD News (@DDNewslive) December 23, 2024
Students who fail the annual examination in classes 5 and 8 will be failed. Failed students will have a chance to retake the test within two months, but if they fail again, they will… pic.twitter.com/MK8MC1iJ0a
పాఠశాల విద్య
రాష్ట్ర జాబితాలోని అంశం గనక ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు.
ఇప్పటికే 16 రాష్ట్రాలు, దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల
విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశాయని సదరు అధికారి పేర్కొన్నారు.
హరియాణా,
పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. మిగతా
రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అధికారి
తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్ విధానం (వార్షిక
పరీక్షల్లో ఫెయిలైతే తిరిగి అదే తరగతిలో చదివేలా చేయడం)పై గతంలో రాష్ట్రాల నుంచి
అభిప్రాయాలను కోరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇక్కడ 'నో డిటెన్షన్ విధానం' కొనసాగుతున్న
విషయం తెలిసిందే.
=====================
0 Komentar