Cricket Records: Baroda Records Highest
T20 Total - Details Here
టీ20 క్రికెట్ లో బరోడా జట్టు
ప్రపంచ రికార్డు – 20 ఓవర్లలో ఏకంగా 349 పరుగులు – వివరాలు
ఇవే
=====================
దేశవాళీ సయ్యద్
ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇటీవల ఉర్విల్ పటేల్ వరుసగా (28
బంతులు & 36
బంతులు) అత్యల్ప బంతుల్లో సెంచరీలు సాధించిన బ్యాటర్ గా రికార్డులు సాధించిన విషయం
తెలిసిందే.
తాజాగా బరోడా
జట్టు టీ20ల్లోనే అత్యధిక పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు
సృష్టించింది. ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన జట్టుగా జింబాబ్వే పేరిట రికార్డు
ఉండేది. ఈ ఏడాది అక్టోబర్ లో గాంబియాపై 344/4 స్కోరు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ బరోడా ఐదు వికెట్ల
నష్టానికి 349 పరుగులు చేసింది. ఇప్పటివరకు ప్రపంచ
టీ20 క్రికెట్లో ఇదే టాప్ స్కోర్.
సిక్కింపై
భారీ విజయం
సిక్కింతో
జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా 349/5 స్కోరు చేసింది. బరోడా బ్యాటర్లు భాను పానియా (134నాటౌట్: 51 బంతుల్లో 5 ఫోర్లు, 15 సిక్స్లు), శివాలిక్ శర్మ (55:17 బంతుల్లో), అభిమన్యు సింగ్ (53: 17 బంతుల్లో) సోలాంకి (50: 16 బంతుల్లో), షష్వాత్ రావత్ (43: 16 బంతుల్లో) చెలరేగిపోయారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో
సిక్కిం ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో సిక్కిం ఏడు వికెట్ల నష్టానికి 86 పరుగులే
చేయగలిగింది. దీంతో 263 పరుగుల భారీ తేడాతో
బరోడా విజయం సాధించింది.
టీ20 క్రికెట్లో పరుగులపరంగా అత్యధిక వ్యత్యాసంతో గెలిచిన నాలుగో
జట్టుగా బరోడా నిలిచింది. జింబాబ్వే 290 పరుగుల తేడాతో గాంబియాను ఓడించగా.. నేపాల్ (మంగోలియాపై 273 పరుగులు), నైజీరియా (ఐవరీ
కోస్ట్ పై 264 పరుగులు) ఈ ఘనతను సాధించాయి.
=====================
HIGHEST
INNINGS TOTALS IN T20S
LARGEST
MARGIN OF VICTORY (BY RUNS) IN T20S
=====================
0 Komentar