Jio New Prepaid Plan: New Year Welcome
Plan with ₹2025 – Details Here
జియో నూతన ప్రీ-పెయిడ్
ప్లాన్: 'న్యూ ఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025' – లాంగ్ టర్మ్ వ్యాలిడిటీతో పాటు రూ.2,150 విలువైన కూపన్ ప్రయోజనాలు
=====================
జియో నూతన ప్రీ-పెయిడ్
ప్లాన్ ను తీసుకొచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏటా మాదిరిగానే ఈ
ఏడాది కూడా 'న్యూ ఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025'ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2025 రీఛార్జి పై లాంగ్ టర్మ్ వ్యాలిడిటీతో పాటు రూ.2,150 విలువైన కూపన్ ప్రయోజనాలనూ అందిస్తోంది.
రిలయన్స్
జియో తీసుకొచ్చిన రూ.2025 ప్రీపెయిడ్ ప్లాన్ తో
రీఛార్జి చేసుకుంటే.. 200 రోజుల వ్యాలిడిటీ
లభిస్తుంది. అపరిమితి 5జీ డేటా ఇస్తోంది. రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 500 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్లు కూడా పొందొచ్చు. ఇవే ప్రయోజనాలతో వస్తున్న
జియో నెలవారీ ప్లాన్ తో పోలిస్తే ఈ ప్లాన్ ద్వారా రూ.468 ఆదా చేసుకోవచ్చని జియో చెబుతోంది. ప్రస్తుతం రూ.349 ప్లాన్ ఇవే ప్రయోజనాలు లభిస్తున్నాయి. 200 రోజులకు ఈ విలువ రూ.2,493 అవుతుందని జియో చెబుతోంది.
ఈ ప్యాక్
కొనుగోలు చేసిన వారికి రూ.2150 విలువైన కూపన్లను
జియో అందిస్తోంది. రూ.500 విలువైన అజియో కూపన్
ను రూ.2,500,
ఆపై కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. స్విగ్గీలో రూ.499 పైబడి చేసిన కొనుగోళ్లపై రూ.150 డిస్కౌంట్ ఇస్తోంది. ఈజ్ మై ట్రిప్ విమాన టికెట్ల బుకింగ్పై రూ.1500 డిస్కౌంట్ పొందొచ్చని జియో పేర్కొంది. ఈ ప్లాన్ డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు
మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. మై జియో యాప్ నుంచి గానీ, జియో అధికారిక వెబ్సైట్, రిటైలర్ల
వద్ద రీఛార్జి చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
=====================
=====================
0 Komentar