LIC’s Bima Sakhi Yojana: All the Details
Here
ఎల్ఎస్ఐసీ: బీమా సఖి యోజన పథకం – మహిళలకు బీమా సఖి ద్వారా స్టయిఫండ్, శిక్షణ
& తర్వాత ఉద్యోగం – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే
======================
మహిళలకు
ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహన కల్పించడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం.
======================
దేశం లో మహిళా
సాధికారికత కార్యక్రమంలో భాగంగా రాబోయే 12 నెలల్లో
లక్ష మంది బీమా సఖిలను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైఫ్
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఎస్ఐసీ) సోమవారం తెలిపింది. బీమా సఖిలకు
స్టయిఫండ్ నిమిత్తం రూ.840 కోట్ల వరకు
వెచ్చించనున్నట్లు ఎస్ఐసీ ఎండీ, సీఈఓ సిద్దార్ధ
మొహంతీ వెల్లడించారు.
ప్రధాన
నరేంద్ర మోదీ బీమా సఖి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 'మేం వెచ్చించే ఖర్చుపై 5 రెట్లు
అదనంగా కొత్త ప్రీమియాన్ని బీమా సఖి ద్వారా వస్తుందని భావిస్తున్నాం. తొలి ఏడాదిలో
రూ.4,000 కోట్ల వరకు కొత్త ప్రీమియం వ్యాపారాన్ని తీసుకొని
రావొచ్చని మేం అంచనా వేస్తున్నాం' అని ఎల్ఎస్ఐసీ ఎండీ
వివరించారు.
మారుమూల
ప్రాంతాలకూ ఎల్బీసీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బీమా సఖి పథకం ఉపయోగపడుతుందని
మొహంతి చెప్పారు. మున్ముందు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బీమా సఖిని నియమించే యోచనలో
ఉన్నామని వెల్లడించారు.
నెలవారీ
భృతితో శిక్షణ ఇచ్చి..: బీమా సఖిగా నియమితులైన మహిళలకు బీమా రంగంలో మూడేళ్లు
శిక్షణ ఇస్తారు. శిక్షణా సమయంలో మొదటి ఏడాది నెలకు రూ.7,000, రెండో ఏడాది రూ.6,000, మూడో ఏడాది రూ.5,000 చొప్పున వారికి
స్టయిఫండ్ ఇస్తారు.
> మూడేళ్ల
శిక్షణ తర్వాత వాళ్లు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేయొచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన
వారికి ఎల్బీసీలో డెవలప్మెంట్ ఆఫీసర్ గానూ అవకాశం లభిస్తుంది.
> పదో
తరగతి ఉత్తీర్ణులైన 18-70 ఏళ్ల మహిళలు ఎల్ఐసీ
వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం
ఉంటుంది.
> మహిళలకు
ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహన కల్పించడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం.
======================
======================
0 Komentar