New Bajaj Chetak Electric
Scooters Launched in India – Price and Specification Details Here
బజాజ్ నుండి కొత్తగా
రెండు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లు విడుదల - ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే
=====================
బజాజ్ ఆటో మరో
కొత్త స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. చేతక్ 35 సిరీస్ లో (Bajaj Chetak) 3501, 3502 పేరిట రెండు
వెర్షన్లను తీసుకొచ్చింది. 3501 అనేది ప్రీమియం
మోడల్. దీని ధర రూ.1.27 లక్షలు (ఎక్సోషోరూమ్, బెంగళూరు)
కాగా.. 3502 ధరను రూ.1.20 లక్షలుగా కంపెనీ
నిర్ణయించింది. ఇదే సిరీస్లో 3503 మోడల్ ను త్వరలో
తీసుకురానున్నారు.
పాత చేతక్
ఈవీ మాదిరిగానే అదే క్లాసిక్ లుక్ తో కొత్త మోడళ్లను బజాజ్ తీసుకొచ్చింది. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్ ను అమర్చారు.
ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళుతుంది.
సింగిల్ ఛార్జ్ 153 కిలోమీటర్లు
ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీని 3 గంటల్లో
పూర్తిగా ఛార్జ్ చేయొచ్చని తెలిపింది.
ఇందులో 5 అంగుళాల టచ్ టీఎఫ్ఎ డిస్ప్లే ఇచ్చారు. ఇందులో మ్యాప్స్ పాటు
కాల్ ఆన్సర్/ రిజెక్ట్, మ్యూజిక్ కంట్రోల్
వంటి సదుపాయాలు ఉన్నాయి. జియో ఫెన్స్, థెఫ్ట్
అలర్ట్,
యాక్సిడెంట్ డిటెక్షన్, ఓవర్ స్పీడ్
అలర్ట్ వంటి భద్రతాపరమైన ఫీచర్లూ జోడించారు.
=====================
=====================
0 Komentar