Pariksha PeCharcha 2025 - All the
Details
పరీక్షా పే
చర్చ – 2025:
పూర్తి వివరాలు ఇవే
=====================
PPC 2025 – Episode 4: Date 14/02/2025,
Time: 10.00 AM
Episode 4: Healthy Eating & Sleep
for Academic Success
https://www.youtube.com/watch?v=3CfR4-5v5mk
=====================
PPC 2025 – Episode 3: Date 13/02/2025,
Time: 10.00 AM
Episode 3: Smarter Learning &
Financial Wisdom ft. Technical Guruji & Radhika Gupta
https://www.youtube.com/watch?v=wgMzmDYShXw
=====================
PPC 2025 – Episode 2: Date 12/02/2025,
Time: 10.00 AM
Episode 2: Deepika Padukone on Mental Health & Exam Warriors
https://www.youtube.com/watch?v=DrW4c_ttmew
=====================
PPC 2025 – Episode 1: Date 10/02/2025,
Time: 11.00 AM
Episode 1: PPC 2025 with Hon'ble PM Shri
Narendra Modi
https://www.youtube.com/watch?v=G5UhdwmEEls
=====================
పరీక్షా పే
చర్చ – 2025:
దేశ ప్రధాని మోదీ ముచ్చటించిన విషయాలు ఇవే
పరీక్షలకు
హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ `పరీక్షా పే చర్చా' కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నారు. దిల్లీలోని సుందరవనంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎప్పుడూ ఒక
పెద్ద హాల్లో పరీక్షలకు సంబంధించిన అనుమానాలు, ఒత్తిడి
తట్టుకోవడం ఎలా అనే అంశాలపై సోదాహరణంగా వివరించే మోదీ.. ఈసారి విభిన్నంగా
విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమం కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతావారంతా
వర్చువల్ గా పాల్గొన్నారు. సుందరవనంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని
బదులిచ్చారు. పరీక్షలే సర్వస్వం కాదన్నారు. మనం రోబోలం కాదని, మనషులమని, ఒక దగ్గరే
గిరిగీసుకొని ఉండొద్దని సూచించారు.
ఒక బ్యాట్స్
మన్ ఫోకస్ పెట్టాలి..
"బయటినుంచి వచ్చే ఒత్తిడి మీద కాకుండా చదువుమీద దృష్టిపెట్టాలి. స్టేడియంలో
వీక్షకులు కేకలేస్తూ, కేరింతలు కొడుతూ
ఎంతగా శబ్దాలు చేస్తున్నా.. బ్యాటర్ దృష్టి మాత్రం బంతిపైనే ఉంటుంది. అలాగే
విద్యార్థులు కూడా నేర్చుకోవడంపైనే దృష్టిపెట్టాలి" అని అన్నారు. కంటినిండా
నిద్ర,
సమతుల ఆహారం ముఖ్యమని, ఆరోగ్యాన్ని
నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
ప్రతిఒక్కరికీ
ఒక్కో టాలెంట్..
“ప్రతి
విద్యార్థికి భిన్నమైన టాలెంట్ ఉంటుంది. కొంతమంది చదువులో ముందుంటారు. మరికొందరికి
మంచి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. విద్య సమగ్ర అభివృద్ధి కోసం ఉద్దేశించినది.
విద్యార్థులు నాలుగు గోడలకే పరిమితం కాకూడదు. వారు తమ అభిరుచుల వైపు మళ్లేందుకు
స్వేచ్ఛ అవసరం. పరీక్షలే సర్వస్వం అనే భావనలో జీవించకూడదు. పిల్లలకు సలహాలు
ఇవ్వకూడదు. వారిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గమనించాలి. వారిలో ఉన్న విశిష్టమైన
ప్రతిభను వెలికితీయాలి" అని చిన్నారులు, టీచర్లకు
మోదీ సూచించారు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ను ప్రధాని ఉదహరించారు. 'సచిన్ కు చదువు కంటే ఆటల మీదే ఆసక్తి ఎక్కువ ఉండేది. దాన్ని
గుర్తించిన అతడి తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు' అని ప్రధాని గుర్తుచేశారు.
ఒక పేపర్
తీసుకొని రాసుకోవాలి..
“సమయపాలన
అన్నింటికంటే ముఖ్యం. రేపు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో ఒక కాగితం మీద
రాసుకోవాలి. ఏ పని కోసం ఎంత సమయం వెచ్చించాలో ఆలోచించుకోండి. మీకు ఇష్టమైన
సబ్జెక్ట్ కు ఎక్కువ సమయం, ఇష్టం లేని దానికి
తక్కువ సమయం కేటాయించొద్దు. దానికి భిన్నంగా చేయండి. కష్టమైన పాఠ్యాంశాన్ని ఒక
సవాలుగా స్వీకరించండి” అని సలహా ఇచ్చారు. “స్నేహితుల్లో మంచి లక్షణాలు గమనించండి.
దానివల్ల ప్రతి పనిలో సానుకూలతను చూసే అలవాటు పెరుగుతుంది. ఇక స్నేహితుల కష్టాలను
అర్థం చేసుకునేందుకు వారితో మాట్లాడండి" అని అన్నారు.
మోదీ ని హిందీ
లో పలకరించిన కేరళ విద్యార్థిని
కేరళ నుంచి
వచ్చిన విద్యార్థి ఆకాంన్షా ప్రధాని మోదీ ని హిందీలో పలకరించారు. దాంతో
ఆశ్చర్యపోయిన ఆయన.. ఇంత చక్కగా హిందీ ఎలా నేర్చుకున్నావంటూ ప్రశ్నించారు. “నాకు
హిందీ అంటే చాలా ఇష్టం. నేనొక కవిత కూడా రాశా" అంటూ దానిని చదివి
వినిపించారు. అలాగే.. మీరు ప్రధాని కాకపోయి ఉంటే ఏ మంత్రిత్వ శాఖ తీసుకుంటారని ఓ
విద్యార్థి మోదీని అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. 'నైపుణ్యాభివృద్ధి శాఖ అంటే ఆసక్తి' అని చెప్పారు.
=====================
Pariksha Pe Charcha 2025 LIVE | PM Modi
Interacts with Students, Teachers & Parents on Exams
Date: 10/02/2025
Time: 11.00 AM
YouTube Links:
Ministry of Education Government of
India
https://www.youtube.com/watch?v=G5UhdwmEEls
Narendra Modi
https://www.youtube.com/watch?v=uv6AZVuozM8
DD Saptagiri
https://www.youtube.com/watch?v=AK0OtF6GM3o
DD Yadagiri
https://www.youtube.com/watch?v=vfByh9wKW0s
=====================
UPDATE 06-02-2025
పరీక్షా పే
చర్చ – 2025 తేదీ & సమయం వివరాలు ఇవే
తేదీ & సమయం: 10/02/2025,
11 AM
=====================
పరీక్షల
భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ప్రారంభం అయ్యింది. 2025 లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో
ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
ఈ కార్యక్రమం
ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని
పోగొట్టి,
పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.
ప్రధానితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 6-12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవచ్చు.
=====================
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 14 డిసెంబర్ 2024
దరఖాస్తు ప్రక్రియ
ముగింపు తేదీ: 14 జనవరి 2025
=====================
=====================
परीक्षा का season यानी तनाव का season! #PPC2025 के साथ परीक्षा के तनाव और डर को पीछे छोड़ने का समय आ गया है। तो फिर इंतजार किस बात का? पीएम @narendramodi सर के साथ अपने अंदर के #ExamWarrior को ignite करिए।
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 17, 2024
प्रधानमंत्री मोदी जी के मास्टर-क्लास का हिस्सा बनने के लिए उन्हें अपने… pic.twitter.com/OMdY2mrnJl
0 Komentar