Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2024: Apply for 13,735 Junior Associate Posts – Details Here

 

SBI Recruitment 2024: Apply for 13,735 Junior Associate Posts – Details Here

ఎస్బీఐలో 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులు - బేసిక్ పే: నెలకు రూ.26,730.

=====================

ఎస్బీఐ భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 342; అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి.

పోస్టులు: జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)

మొత్తం పోస్టుల సంఖ్య: 13,735.

హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) లో పోస్టుల సంఖ్య: 342.

అమరావతి సర్కిల్ (ఆంధ్రప్రదేశ్)లో పోస్టుల సంఖ్య: 50.

విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 01.04.2024 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1996 - 01.04.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

బేసిక్ పే: నెలకు రూ.26,730.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.12.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.01.2025.

=====================

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags