Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2025: Apply for 600 Probationary Officer Posts – Details Here

 

SBI Recruitment 2025: Apply for 600 Probationary Officer Posts – Details Here

ఎస్బీఐలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకు

=====================

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్… పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 27.12.2024 నుంచి 16.01.2025 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ప్రొబేషనరీ ఆఫీసర్: 600 పోస్టులు (ఎస్సీ- 87, ఎస్టీ - 57, ఓబీసీ - 158, ఈడబ్ల్యూఎస్ - 58, యూఆర్-240)

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకు

దరఖాస్తు రుసుము: రూ .750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 27.12.2024

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16.01.2025

=====================

NOTIFICATION

APPLY HERE (Turn Your Mobile)

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags