Airtel & Jio:
Special Recharge Plans with Voice & SMS without Data – Details Here
ఎయిర్ టెల్ &
జియో: డేటా లేకుండా వాయిస్ & ఎస్సెమ్మెస్ లతో
ప్రత్యేక రీఛార్జి ప్లాన్ లు – వివరాలు ఇవే
===================
రిలయన్స్
జియో,
భారతీ ఎయిర్టెల్ కొత్త రీఛార్జి ప్లాన్లను తీసుకొచ్చాయి.
వాయిస్,
ఎస్సెమ్మెస్ కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని
టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇరు సంస్థలు వీటిని
ప్రవేశపెట్టాయి. డేటా వద్దనుకొనేవారికి ఇవి ఉపయోగపడతాయి.
జియో వాయిస్
ఓన్లీ పేరిట రెండు కొత్త రీఛార్జి ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.458 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో
అందుబాటులో ఉంది. ఈ రీఛార్జితో అన్లిమిటెడ్ వాయిస్కాల్స్, 1000 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. దీంతో పాటు జియో టీవీ, సినిమా (నాన్- ప్రీమియం), క్లౌడ్ సబ్స్క్రిప్షన్ సదుపాయాలు కూడా పొందొచ్చు. ఆ సంస్థ తీసుకొచ్చిన మరో
ప్లాన్ ధర రూ.1958). దీనిలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. ఈ ప్యాకేజీ వ్యాలిడిటీ 365 రోజులు. రూ.458 రీఛార్జి ప్లాన్ లో ఉన్న అదనపు ప్రయోజనాలు ఇందులోనూ లభిస్తాయి.
ఎయిర్టెల్
కూడా వాయిస్, ఎస్సెమ్మెస్ల కోసం ప్రత్యేకంగా రెండు
రీఛార్జి ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.499కు 84 రోజుల వ్యాలిడిటీతో ప్రవేశపెట్టింది. అన్లిమిటెడ్ వాయిస్
కాల్స్,
900 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. ఎయిర్టెల్ మరో ప్లాన్
ధర రూ.1959.
365 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న దీనిలో అన్లిమిటెడ్
వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి. ఈ
రెండింటిపై మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, హలో ట్యూన్ అదనపు
ప్రయోజనాలు పొందొచ్చు.
వాయిస్ ఓన్లీ
ప్లాన్లతో పాటు ఎయిర్టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్యాకేజీలను తీసుకొచ్చింది.
తక్కువ డేటాతో రీఛార్జి కోసం ఎదురుచూస్తున్న వారికి ఇవి ఉపయోగపడతాయి. 84 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్టెల్ రూ.548 ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని రీఛార్జితో అన్లిమిటెడ్
వాయిస్ కాల్స్, 900 ఎస్సెమ్మెస్ లు, 7జీబీ డేటా పొందొచ్చు. మరో దాని ధర రూ.2249. వ్యాలిడిటీ 365 రోజులు. 30జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి.
===================
===================
0 Komentar