Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights – 02/01/2025

 

AP Cabinet Meeting Highlights – 02/01/2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 02/01/2025

====================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 02-01-2025 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి "I &PR శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=pp8svRxW1V8


====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం ‘I &PR’ శాఖ మంత్రి పార్థసారథి" ప్రెస్ మీట్ లో వివరించారు.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:

> అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది.

> మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది.

> భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

> పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

> తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచేందుకు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. > ఎస్ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

> రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు పై సమావేశంలో చర్చించారు.

> నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించినట్లు తెలుస్తోంది.

> చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్ లో చర్చ జరిగినట్లు తెలిపారు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags