AP Education Minister
Press Meet Details on DSC and Schools – Important Points Here
ఏపీ: డీఎస్సీ
మరియు పాఠశాలలపై విద్యా మంత్రి ప్రెస్ మీట్ లో వివరించిన ముఖ్యమైన అంశాలు ఇవే
====================
నేడు (జనవరి 31)
మంగళగిరిలో విద్యా మంత్రి లోకేష్ గారు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా
మాట్లాడారు.
> ఎమ్మెల్సీ
ఎన్నికల కోడ్ ముగియగానే DSC నోటిఫికేషన్ విడుదల
చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
> 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు.
> ఉపాధ్యాయ
సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ
టీచర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు.
> విద్యా
శాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారు.
> టీచర్ల
బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు 'ట్రాన్స్ఫర్ యాక్ట్' తీసుకొస్తున్నాం.
> విద్యార్థుల
సంఖ్య కచ్చితంగా తెలుసుకునేందుకు అపార్ కార్డ్ విధానం, ప్రభుత్వ బడుల్లో డ్రాపవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక
వ్యవస్థ తెస్తున్నాం అని తెలిపారు.
====================
0 Komentar