AP Inter Exams: Inter Board Plans Huge Reforms in Intermediate
Exams
ఏపీ ఇంటర్
పరీక్షలు: ఇంటర్మీడియట్ పరీక్షలలో భారీ సంస్కరణలు – ప్రథమ ఏడాది పరీక్షలు
ఇక ఉండవు
====================
ఏపీ ఇంటర్ పరీక్షల
విధానం లో సంస్కరణలు చేపడుతున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా చెప్పారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
“చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. జాతీయ కరికులం చట్టాన్ని
అనుసరించి సంస్కరణలు చేపడుతున్నాం.
సంస్కరణల్లో
భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరాంతర పరీక్షలు తొలగిస్తాం. ఆయా కళాశాలలు అంతర్గతంగా
ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు
నిర్వహిస్తుంది.” అని కృతికా శుక్లా తెలిపారు.
కొత్తగా
ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి
ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్ట్స్ గ్రూపులకు 20 శాతం ఇంటర్నల్ మార్కులు, సైన్స్ గ్రూపు
విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్స్
ఉండనున్నట్లు సమాచారం.
ఇంటర్మీడియట్
సిలబస్‌తో పాటు పరీక్షల విధానాన్ని కూడా పూర్తిగా సీబీఎస్‌ఈ నమూనాలోకి మార్చాలని
మండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశముంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు
మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్నల్ పరీక్షలే నిర్వహించడంపైనా
ఇంటర్మీడియట్ విద్యామండలి ఆలోచన చేస్తోంది. రెండో ఏడాదిలో నిర్వహించే పబ్లిక్
పరీక్షల్లో ఫస్టియర్, సెకండియర్ సిలబస్
నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థుల
నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వీటి ఆధారంగా
తుది నిర్ణయం తీసుకుంటారు
మ్యాథ్స్ సిలబస్ తగ్గింపు:
మ్యాథ్స్
ప్రస్తుతం రెండు పేపర్లుగా ఉండగా.. దీన్ని 100 మార్కులకు ఒక్క పేపర్‌కు కుదించాలనే ప్రతిపాదన ఉంది. బోటనీ, జువాలజీ చెరో 50 మార్కుల
చొప్పున వంద మార్కులకు ఒక్కటే పేపర్ ఇవ్వనున్నారు. రెండింటినీ కలిపి
జీవశాస్త్రంగా మార్పు చేస్తారు. ఆర్ట్స్ గ్రూపుల్లో రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. మిగతా 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 30 మార్కులకు
ప్రస్తుతం ఉన్నట్లే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆర్ట్స్ సబ్జెక్టులకు ఇచ్చినట్లే
మ్యాథ్స్‌కి సంబంధించి 20 శాతం ఇంటర్నల్
మార్కుల విధానం ఉంటుందని తెలుస్తోంది.
సబ్జెక్టుల ఎంపిక:
ఇంటర్మీడియట్‌లో
ప్రస్తుతం ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్
కాకుండా గ్రూపు సబ్జెక్టులు ఉంటున్నాయి. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 1000 మార్కులకు
తీసుకొస్తున్నారు. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు జరుగుతాయి. మొదటి ఏడాది అన్నీ ఇంటర్నల్ పరీక్షలే కావడంతో
రెండో ఏడాది మార్కులే ప్రామాణికంగా ఉండనున్నాయి. ఒక సబ్జెక్టుగా ఇంగ్లిష్
తప్పనిసరిగా ఉంటుంది. రెండో ఆప్షన్‌గా విద్యార్థులు ఏ సబ్జెక్టునైనా ఎంపిక
చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆర్ట్స్ గ్రూప్ వారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితం లాంటి వాటిని రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే
అవకాశమూ ఉంటుంది. ఈ అంశాలపై అభిప్రాయ సేకరణ తర్వాత తుది ఎంపిక ఉంటుంది. అనంతరం
అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
====================
0 Komentar