AP - Voters Final List-2025 Released
ఏపీ: ఓటర్ల
తుది జాబితా-2025 విడుదల
====================
ఏపీ రాష్ట్ర
ఓటర్ల తుది జాబితా-2025 ను జిల్లాల వారీగా
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది
ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. అసెంబ్లీ నియోజకవర్గాల
వారీగా ఓటర్ల జాబితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తెలిపింది. జాబితాను
ఎక్కడికక్కడే ప్రదర్శించాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
2025 జనవరి 1 నాటికి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల
సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447గా ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,81,814, పురుష ఓటర్లు 2,02,88,543 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 66,690 మంది,
థర్డ్ జెండర్ ఓటర్లు 3400 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు 5,14,646 మంది ఉన్నారు.
రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఎన్నికల
సంఘం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 232 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని పేర్కొంది.
====================
====================
జాతీయ ఓటర్ల
దినోత్సవం (జనవరి 25) - ఓటర్ల ప్రతిజ్ఞ
National Voters Day - 25th January -
Pledge and Placards
====================
Voter Helpline App: భారత ఎన్నికల కమిషను వారి ‘ఓటర్ హెల్ప్‌లైన్' యాప్
ఓటర్ల కు
ఉపయోగపడే అన్నీ వెబ్సైట్ లింక్స్ ఇవే
====================
0 Komentar