Australian Open Men’s Singles - 2025:
Jannik Sinner Wins 2nd Consecutive AO Title – Total 3 Grand Slam
Titles
ఆస్ట్రేలియన్
ఓపెన్-2025:
వరుసగా రెండవ ఆస్ట్రేలియన్
ఓపెన్ గెలిచిన జనిక్ సినర్ – మొత్తం గా మూడు గ్రాండ్ స్లామ్ లు గెలిచిన ఇటలీ
టెన్నిస్ ఆటగాడు
==================
నంబర్ వన్
అయిన యానిక్ సినర్ (ఇటలీ) వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఈ 23 ఏళ్ల
డిఫెండింగ్ ఛాంపియన్ ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 7-6 (4),
6-3 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని
మట్టికరిపించాడు. సినర్ కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ క్రమంలోనే
ఆస్ట్రేలియన్ ఓపెన్ వరుసగా రెండు టైటిళ్లు సాధించిన నాలుగో ఆటగాడిగా సినర్
రికార్డు సృష్టించాడు. సినర్ కంటే ముందు ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెదరర్, నొవాక్
జకోవిచ్ వరుసగా రెండుసార్లు విజేతలుగా నిలిచారు.
ఫైనల్ మ్యాచ్
తొలి సెట్లో సినర్, జ్వెరెవ్ హోరాహోరీగా
తలపడ్డారు. ఒకదశలో 3-3 పాయింట్లతో సమానంగా
నిలిచారు. కానీ, ఆ తర్వాత సినర్ చెలరేగి సెట్ ను సొంతం
చేసుకున్నాడు. రెండో సెట్ లో జర్మనీ ఆటగాడు పుంజుకున్నట్లు కనిపించాడు. 4-3తో లీడ్ లోకి దూసుకెళ్లాడు. ఇద్దరూ వరుసగా పాయింట్లు
సాధించడంతో స్కోరు 6-6తో సమం అయింది. టై
బ్రేకర్ ఆరంభంలో జ్వెరెవ్ ఆధిక్యంలో నిలవగా.. సినర్ క్రమంగా పుంజుకుని రెండో సెట్ ను
గెలిచి ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. మూడో సెట్ ఆరంభంలో దూకుడుగా ఆడి గట్టిపోటీ
ఇచ్చిన జ్వెరెవ్.. తర్వాత డీలా పడిపోయాడు. దీంతో మూడో గ్రాండ్లమ్ ఫైనల్లోనూ అతను
ఓటమిపాలయ్యాడు. అంతకుముందు యూఎస్ ఓపెన్ 2020 ఫైనల్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ 2024లో జ్వెరెవ్ ఫైనల్ లో ఓడిన సంగతి తెలిసిందే.
==================
0 Komentar