Australian Open Women Singles-2025:
Madison Keys Defeated the Defending Champion Sabalenka for Maiden Grand Slam
Title
ఆస్ట్రేలియన్
ఓపెన్ మహిళల సింగిల్స్ -2025: డిఫెండింగ్
ఛాంపియన్ సబలెంకాను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ గెలిచిన మాడిసన్ కీస్
====================
ఆస్ట్రేలియా
ఓపెన్ 2025 లో సబలెంకకు షాక్ తగిలింది. ఈ టోర్నీలో శనివారం జరిగిన
మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె ఓడింది. టైటిల్ పోరులో సబలెంకను ఢీ కొట్టిన అమెరికా అమ్మాయి
మాడిసన్ కీస్ ఛాంపియన్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-3, 2-6, 7-5 తేడాతో సబలెంకను మట్టికరిపించిన మాడిసన్ కీస్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.
మాడిసన్ కీస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను
చేజిక్కించుకుంది. కెరీర్ లో కీస్ కు ఇదే
తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. 19వ సీడ్ కీస్ ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో
ఆడడం ఇది రెండోసారి. 2017లో ఆమె యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోయింది. కీస్ తొలి గ్రాండ్
స్లామ్ ఫైనల్ కు రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు మధ్య దాదాపు ఎనిమిదేళ్ల విరామం
ఉంది. ఓపెన్ శకంలో ఇదే అతి సుదీర్ఘ విరామం. కీస్ కు ఇది 46వ గ్రాండ్
స్లామ్ టోర్నీ. అత్యంత ఆలస్యంగా గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన క్రీడాకారిణుల
జాబితాలో పెనెట్టా (49), బర్తోలి (47) తర్వాత ఆమె మూడో స్థానంలో ఉంది.
ఫేవరెట్ సబలెంక ఫైనల్లో తొలి సెట్లో తడబడింది. మూడుసార్లు
ఆమె సర్వీసును బ్రేక్ చేసిన కీస్.. సెట్ను చేజిక్కించుకుంది. సబలెంక నాలుగు డబుల్
ఫాల్ట్ లు, 13 అనవసర తప్పిదాలు చేయడం కూడా కీసు కలిసొచ్చింది. అయితే
రెండో సెట్లో సబలెంక పుంజుకుంది. మూడు, అయిదో గేముల్లో ప్రత్యర్థి
సర్వీసును బ్రేక్ చేయడంతో ఆ సెట్ను గెలిచి, పోరును
నిర్ణయాత్మక సెట్కు తీసుకెళ్లింది. మూడో సెట్ రసవత్తరంగా జరిగింది. క్రీడాకారిణులు
ఇద్దరూ సర్వీసు నిలబెట్టుకుంటూ సాగడంతో ఓ దశలో 5-5తో నిలిచారు.
ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకున్న కీస్ 6-5తో ఆధిక్యంలోకి వెళ్లింది.
టైబ్రేకర్ తప్పదేమో అనిపించింది. కానీ కీలకమైన 12వ గేమ్
సబలెంక సర్వీసును బ్రేక్ చేసిన కీస్.. విజేతగా నిలిచింది. మ్యాచ్లో కీస్ 6 ఏస్లు, 29 విన్నర్లు కొట్టింది. సబలెంక 5 డబుల్ ఫాల్ట్లు, 33 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్లో వరుసగా మూడోసారి టైటిల్ సాధించాలన్న ఆమె కల చెదిరింది.
====================
0 Komentar