Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HMPV Cases: Health Ministry Confirms Two Cases in Karnataka

 

HMPV Cases: Health Ministry Confirms Two Cases in Karnataka

కర్ణాటకలో రెండు HMPV కేసులు - ఆరోగ్య శాఖ నిర్ధారణ – వివరాలు ఇవే

====================

ఇటీవల చైనాలో HMPV సృష్టిస్తోన్న కలకలం, నేడు (జనవరి 6) భారత్ లో ఆ వైరసు గుర్తించారు. కర్ణాటకలో రెండు కేసులు వెలుగుచూసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించింది.

"దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ రెండు కేసులు వెలుగు చూశాయి" అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మూడు నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. మరో చిన్నారి చికిత్స పొందుతోంది. అయితే వైరస్ వెలుగు చూసిన దేశాల్లో వీరి కుటుంబాలు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని తెలిపింది.

HMPV వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారినపడే అవకాశాలు ఎక్కువ.

చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న వార్తలతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (JMG) సమావేశం నిర్వహించింది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లూయెంజా, ఆర్ఎస్పీ, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తేల్చింది. భారత్లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే వివిధచోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags