NALCO Recruitment 2025: Apply for 518
Non-Executive Posts – Details Here
నాల్కో లో 518 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే
==================
భారత
ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)... నాన్
ఎగ్జిక్యూటివ్ కేడర్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హులైన అభ్యర్థులు జనవరి 21వ తేదీలోగా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు:
1. SUPT (జేఓటీ)-
ల్యాబొరేటరీ: 37 పోస్టులు
2. SUPT (జేఓటీ)-
ఆపరేటర్: 226 పోస్టులు
3.SUPT (జేఓటీ)-
ఫిట్టర్: 73 పోస్టులు
4. SUPT (జేఓటీ)
- ఎలక్ట్రికల్: 63 పోస్టులు
5. SUPT (జేఓటీ)-
ఇన్స్ట్రుమెంటేషన్ (ఎం&ఆర్)/
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (ఎపి): 48 పోస్టులు
6. SUPT (జేఓటీ)-
జియాలజిస్ట్ 4 పోస్టులు
7. SUPT (జేఓటీ)-
హెచ్ఎంఎం ఆపరేటర్: 9 పోస్టులు
8. SUPT (ఎస్ఓటీ)
- మైనింగ్: 1 పోస్టు
9. SUPT (జేఓటీ)-
మైనింగ్ మేట్: 15 పోస్టులు
10. SUPT (జేఓటీ)-
మోటార్ మెకానిక్: 22 పోస్టులు
11. డ్రస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడర్ (డబ్ల్యూ2 గ్రేడ్): 5 పోస్టులు
12. ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్-III (పీఓ గ్రేడ్): 2 పోస్టులు
13. నర్స్ గ్రేడ్-III (పీఏ గ్రేడ్): 7 పోస్టులు
14. ఫార్మసిస్ట్ గ్రేడ్-III (పీఏ గ్రేడ్): 6 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 518.
అర్హత:
పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ఠ
వయోపరిమితి: 21-01-2025 నాటికి డ్రస్సర్-కమ్- ఫస్ట్
ఎయిడర్/ ల్యాబొరేటరీ టెక్నీషియన్/ నర్సు/ ఫార్మసిస్ట్ పోస్టులకు 35 ఏళ్లు; ఎస్ యూపీటీ
(ఎస్ఓటీ)- మైనింగ్ పోస్టులకు 28 ఏళ్లు; ఇతర పోస్టులకు 27 ఏళ్లు
మించకూడదు.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్
టెస్ట్,
సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/
దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్ మెన్లకు మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 31-12-2024.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 21-01-2025.
==================
==================
0 Komentar