Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Launches Gen 3 Electric Scooter – Features & Prices Details Here

 

Ola Electric Launches Gen 3 Electric Scooter – Features & Prices Details Here

ఓలా ఎలక్ట్రిక్ జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదల - ఫీచర్లు & ధరల వివరాలు ఇవే

==================

ఓలా ఎలక్ట్రిక్ మూడోతరం జనరేషన్ ప్లాట్ఫామ్ పై రూపొందిన విద్యుత్ ద్విచక్ర వాహనాలను శుక్రవారం లాంచ్ చేసింది. ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్+, ఎస్1 ప్రో, ఎస్1 ప్రో+ పేరిట మొత్తం నాలుగు రకాల స్కూటర్లను వివిధ బ్యాటరీ ఆప్షన్లలో తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.79 వేల నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.1.69 లక్షల వరకు ఉన్నాయి. గతంలో ఉన్న మోడళ్లకు అదనంగా ఎస్1 ప్రో+ మోడల్ ను తీసుకువచ్చారు.

> ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎస్1 ప్రో+ పేరిట కొత్త స్కూటర్ను మార్కెట్లోకి ఓలా పరిచయం చేసింది. ఇది 5.3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. వీటి ధరలు రూ.1,69,999 రూ.1,54,999గా కంపెనీ నిర్ణయించింది.

> ఎస్ 1 ప్రో 4kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,34,999; 3kwh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,14,999గా నిర్ణయించారు.

> ఎస్ 1ఎక్స్ 2kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు. 3kWh వేరియంట్ ధర రూ. 89,999, 4kWh ధర రూ.99,999గా కంపెనీ వెల్లడించింది.

> ఎస్1 ఎక్స్+ 4kWh బ్యాటరీ ఆప్షన్తో మాత్రమే వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.1,07,999గా నిర్ణయించారు.

జనరేషన్ ప్లాట్ఫామ్ పై రూపొందిన ఈ స్కూటర్లు సామర్థ్యం, భద్రత పరంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పవర్ పరంగా 20 శాతం, 11 శాతం తక్కువ ఖర్చుతో 20 శాతం అధిక రేంజ్లో ఈ స్కూటర్లు తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ సదుపాయం వంటివి వీటికి జోడించినట్లు పేర్కొంది. ఈ కొత్త స్కూటర్లు విద్యుత్ స్కూటర్ల మార్కెట్ను మరో మెట్టు ఎక్కిస్తాయని కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. నేటినుంచే (జనవరి 31) ఆర్డర్లు ప్రారంభం అవుతాయని, ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది. ఓలా రోస్ట్రర్ ఎక్స్ మోటార్ సైకిల్ను ఫిబ్రవరి 5 న లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త స్కూటర్లు లాంచ్ అయిన నేపథ్యంలో జనరేషన్ 2 స్కూటర్లపై రూ.35 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఓలా ఎస్) ప్రో- (SI Pro+)

ఇది 13kw మోటార్తో వస్తోంది. ఇందులో 5.3 kWh బ్యాటరీ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 141 కిలోమీటర్లు వెళుతుందని, 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 4kWh బ్యాటరీ వేరియంట్ గంటకు 128 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 242 కిలోమీర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని తెలిపింది. ఇందులో హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో మోడల్లు ఉన్నాయి. డ్యూయల్ ఏబీఎస్, ముందూ వెనుక డిస్క్ బ్రేక్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ సిల్వర్, జెట్ బ్లాక్, స్టెల్లర్ బ్లూ, మిడ్వైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఎస్ ప్రో (SI Pro)

ఇది 11kw మోటార్తో వస్తోంది. ఇందులో 4kwh బ్యాటరీ వేరియంట్ 125 కిలోమీటర్ల టాపీస్పీడ్, 242 రేంజ్లో వస్తోంది. 3kWh బ్యాటరీ వేరియంట్ టాప్ స్పీడ్ 117 కిలోమీటర్లు కాగా.. 176 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో మోడ్లు ఉన్నాయి. సింగిల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్ బ్రేక్ సదుపాయాలతో వస్తోంది. పోర్సిలియన్ వైట్, ఇండస్ట్రియల్ సిల్వర్, జెట్ బ్లాక్, స్టెల్లర్ బ్లూ, మిడ్నైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఎస్ ఎక్స్ శ్రేణి (S1 X+ and S1 X)

ఎస్ ఎక్స్ శ్రేణిలో ఎస్ఎక్స్+ అనేది ప్లాన్షిప్ స్కూటర్. ఇందులో హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో మోడ్లు ఉన్నాయి. సింగిల్ ఏబీఎస్ తో వస్తోంది. 4kwh బ్యాటరీ వేరియంట్ 11 kw మోటార్ వస్తోంది. ఇది 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 242 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది.

ఎంట్రీ లెవల్లో ఎస్ ఎక్స్ మూడు బ్యాటరీ ప్యాక్స్ (2, 3, 4 kwh) లభిస్తోంది. ఇందులో 7kW మోటార్క్ను ఇచ్చారు. వీటిలో హైఎండ్ వేరియంట్ టాపీస్పీడ్ 123 కిలోమీటర్లు, 3 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ 115 కిలోమీటర్లు, 2 కిలోవాట్ 101 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళతాయి. వీటి రేంజ్ వరుసగా 242, 176, 108 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. ఇందులో హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో మోడ్లు ఉన్నాయి. తెలుపు, నలుపు, నీలం, ఎరుపు రంగుల్లో లభిస్తుంది.

> ఫిబ్రవరి నెలలో మూవ్ ఓఎస్ 5ను తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో స్మార్ట్వచ్ యాప్, స్మార్ట్ పార్క్, రోడ్ ట్రిప్ మోడ్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయని కంపెనీ చెబుతోంది.

> జనరేషన్ 3 పోర్ట్ఫోలియోపై వచ్చిన స్కూట్లర్లకు, బ్యాటరీపైనా 3 ఏళ్లు /40 వేల కిలోమీటర్ల వారెంటీ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.14,999 చెల్లించి బ్యాటరీ వారెంటీని 8 ఏళ్లు 1.25 లక్షల కిలోమీటర్లకు పెంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

==================

WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags