Padma Awards 2025 - Full List of Padma
Vibhushan, Padma Bhushan, Padma Shri Recipients
పద్మ
అవార్డులు-2025: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ
గ్రహీతల పూర్తి జాబితా ఇదే
====================
> తెలుగు
రాష్ట్రాల నుంచి మొత్తం 7 మందికి పద్మ
పురస్కారాలు
> వైద్య
విభాగంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని పద్మ విభూషణ్
> కళల
విభాగంలో సినీనటుడు బాలకృష్ణ పద్మభూషణ్
> నటులు అజిత్
మరియు శోభన లకు పద్మ భూషణ్
> హాకీ ప్లేయర్
శ్రీజేష్ కి పద్మ భూషణ్ & క్రికెటర్ అశ్విన్ కి పద్మశ్రీ
====================
76 వ గణతంత్ర
దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్ర ప్రభుత్వం 'పద్మ' పురస్కారాలు 2025 ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక
అవార్డులకు ఎంపిక చేసింది.
ఏడుగురిని
పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణకు
చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని వైద్య విభాగంలో పద్మ విభూషణ్ వరించగా.. ఏపీ
నుంచి కళల విభాగంలో సినీనటుడు బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
====================
పద్మ విభూషణ్
(ఏడుగురు):
1. దువ్వూరు
నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) - తెలంగాణ
2. జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) – చండీగఢ్
3. కుముదిని
రజినీకాంత్ లాఖియా (కళలు) - గుజరాత్
4. లక్ష్మీనారాయణ
సుబ్రమణియం (కళలు) - కర్ణాటక
5. ఎం.టి. వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – కేరళ
6. ఒసాము
సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) -
జపాన్
7. శారదా
సిన్హా (మరణానంతరం) (కళలు) - బిహార్
పద్మభూషణ్ (19
మంది):
1. నందమూరి
బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్
2. ఎ.
సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - కర్ణాటక
3. అనంత్
నాగ్ (కళలు) - కర్ణాటక
4. బిబేక్
దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) -
ఎన్సీటీ దిల్లీ
5. జతిన్
గోస్వామి (కళలు) – అస్సాం
6. జోస్
చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ
7. కైలాశ్
నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్సీటీ దిల్లీ
8. మనోహర్
జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
9. నల్లి
కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) –
తమిళనాడు
10. పీఆర్
శ్రీజేశ్ (క్రీడలు) - కేరళ
11. పంకజ్
పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) -
గుజరాత్
12. పంకజ్
ఉదాస్ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర
13. రామ్బహదుర్
రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తరప్రదేశ్
14. సాధ్వీ
రితంభరా (సామాజిక సేవ) - ఉత్తర్ ప్రదేశ్
15. ఎస్.
అజిత్ కుమార్ (కళలు) - తమిళనాడు
16. శేఖర్
కపూర్ (కళలు) - మహారాష్ట్ర
17. శోభన
చంద్రకుమార్ (కళలు) - తమిళనాడు
18. సుశీల్
కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్
19. వినోద్
ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – అమెరికా
పద్మశ్రీ (113
మంది)
1. మందకృష్ణ
మాదిగ (ప్రజా వ్యవహారాలు) – తెలంగాణ
2. కె.
ఎల్.కృష్ణ (సాహిత్యం, విద్య) -
ఆంధ్రప్రదేశ్
3. మాడుగుల
నాగఫణిశర్మ (కళలు) - ఆంధ్రప్రదేశ్
4. మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) – ఆంధ్రప్రదేశ్
5. వి.
రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్
వీరితో పాటు మరో
108 మంది కి పద్మ శ్రీ వరించింది. అన్నీ పద్మ అవార్డు విజేతల వివరాల కొరకు క్రింద ఇవ్వబడ
PDF మీద క్లిక్ చేయండి.
====================
====================
0 Komentar