Sanchar Saathi -
Indian Govt APP – Mobile Users Can Report on Fraud-Communications With this APP
సంచార్ సాథీ
- భారత ప్రభుత్వ యాప్ - మొబైల్ వినియోగదారులు ఈ యాప్ ద్వారా మోసపు సమాచారాలను &
స్పామ్ కాల్స్ ని రిపోర్ట్ చేయవచ్చు
=====================
మొబైల్ ఫోన్
వినియోగదారులను విసుగెత్తిస్తున్న స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర టెలీకాం శాఖ సంచార్ సాధీ
పేరుతో ఒక మొబైల్ యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ తో వినియోగదారులు వారి మొబైల్
ఫోన్ కాల్ లాగ్ ల నుండి నేరుగా మోసపూరిత కాల్స్ ను ఫ్లాగ్ చేయవచ్చు.
అధికారిక
యాప్
“సంచార్ సాథీ
యాప్ ఇప్పుడు లైవ్లో ఉంది. ఈ రోజు మీ డిజిటల్ భద్రత కోసం ఈ యాప్ ను స్కాన్ చేసి
డౌన్ లోడ్ చేసుకోండి.” అని డాట్ తన అధికారిక హ్యాండిల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో
శుక్రవారం ప్రకటించింది. టెలీకాం శాఖ సంచార్ సాథీ పోర్టల్ ను 2023 లోనే
ప్రారంభించింది. ఇప్పుడు, తాజాగా ఈ యాప్ (APPS) ద్వారా యూజర్లు తక్షణమే, సులభంగా, తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి మోసపూరిత కమ్యూనికేషన్లను
రిపోర్ట్ చేయడానికి వీలవుతుంది.
=====================
=====================
The growth of Viksit Bharat is going to be on the pillars of telecom and digital connectivity.#SancharSaathiMobileApp pic.twitter.com/Sw7IXNkb5r
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 17, 2025
SANCHAR SAATHI APP is now LIVE!
— DoT India (@DoT_India) January 17, 2025
Scan for your digital safety today and access essential tools at your fingertips!#SancharSaathiMobileApp pic.twitter.com/TNKhRHUE4O
0 Komentar