UPSC Civil Services Examination 2025:
All the Details Here
యూపీఎస్సీ -
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025: పూర్తి వివరాలు ఇవే
====================
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2025 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా
వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి
దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 979
ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి
ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నఅభ్యర్ధులు కూడా అర్హులే.
సివిల్
సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2025
మొత్తం
ఖాళీలు: 979
సర్వీసులు:
1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
2. ఇండియన్ ఫారిన్ సర్వీస్
3. ఇండియన్ పోలీస్ సర్వీస్
4. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
5. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
6. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ 'ఎ'
7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
8. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
9. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
11. ఇండియన్ పి&టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ 'ఏ'
12. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
13. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ & ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్) గ్రూప్ 'ఏ'
14. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇనకం ట్యాక్స్) గ్రూప్ 'ఏ'
15. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ 'ఎ' (గ్రేడ్-3)
16. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
17. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి' (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
18. దిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్
డయ్యూ,
దాద్రా అండ్ నగర్ హవేలీ సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి'
19. దిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ & డయ్యూ, దాద్రా అండ్ నగర్
హవేలీ పోలీస్ సర్వీస్, గ్రూప్ 'బి'
20. పాండిచ్చేరి సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి'
21. పాండిచ్చేరి పోలీస్ సర్వీస్, గ్రూప్ 'బి'
అర్హతలు:
అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ
చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 01-08-2025 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక
విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్
ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
రుసుము: ఓబీసీ / ఇతర అభ్యర్థులకు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాథమిక పరీక్ష కేంద్రాలు:
అనంతపురం,
హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు:
హైదరాబాద్, విజయవాడ. ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 22.01.2025
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 11.02.2025.
ప్రిలిమ్స్
పరీక్ష తేదీ: 25.05.2025
====================
====================
0 Komentar