India Post Office Recruitment 2025:
Apply for 21,413 GDS Posts (Schedule-1, Jan 2025) – Details Here
తపాలా శాఖలో 21,413
గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు (షెడ్యూల్-1, జనవరి 2025) – జీత భత్యాలు: నెలకు రూ.10,000 - రూ. 29,380
=================
దేశ
వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413
గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-1, జనవరి 2025)
వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు
చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి
ఉన్నవారు మార్చి 3 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణ డాక్
సేవక్స్: బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్
బ్రాంచ్ పోస్టు మాస్టర్ / డాక్ సేవక్:
తెలుగు
రాష్ట్రాల సర్కిల్ లో ఖాళీలు:
ఆంధ్రప్రదేశ్-
1215,
తెలంగాణ- 519
మొత్తం ఖాళీల
సంఖ్య: 21,413.
అర్హత: పదో
తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం
తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు
చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
జీతభత్యాలు:
నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్పీస్టు
మాస్టర్/ డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
ఎస్సీ,
ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు
మూడేళ్లు,
దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక
విధానం: అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా షార్ట్
లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభం: 10.02.2025.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరితేదీ: 03.03.2025.
=====================
=====================
0 Komentar