JioHotstar Launched:
JioCinema & Hotstar Combined – Subscription Plan Details Here
జియో హాట్‌స్టార్
ప్రారంభం: జియో సినిమా & హాట్‌స్టార్ కలయిక - సబ్‌స్క్రిప్షన్
ప్లాన్ వివరాలు ఇవే
===================
జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ రెండు కలిశాయి, ఇప్పుడు జియో హాట్ స్టార్
(JioHotstar) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై జియో సినిమా,
డిస్నీ+ హాట్ స్టార్ లోని కంటెంట్
అంతా ఒకేచోట వీక్షించొచ్చు.
సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వివరాలు ఇవే..
1. మొబైల్
ప్లాన్ (యాడ్- సపోర్టెడ్ ప్లాన్) ప్రారంభ ధర రూ. 149. దీని వ్యాలిడిటీ 3 నెలలు. ఇక
ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.499గా కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాన్ల ద్వారా
కేవలం ఒక మొబైల్లో మాత్రమే కంటెంట్ చూసే సదుపాయం ఉంటుంది.
2. రెండు
డివైజ్లకు సపోర్ట్ చేసేలా రెండు సూపర్ ప్లాన్లను (యాడ్- సపోర్టెడ్ ప్లాన్) జియోహాట్
స్టార్ తీసుకొచ్చింది. మూడు నెలల వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చిన ప్లాన్ ధర
రూ.299. ఇక ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.899.
3. ప్రకటనలు
లేకుండా కంటెంట్ వీక్షించాలనుకొనేవారి కోసం జియో హాట్ స్టార్ రెండు ప్రీమియం
ప్లాన్లను ప్రవేశపెట్టింది. మూడు నెలల ప్రీమియం ప్లాన్ ధర రూ.499. ఏడాది
వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499. ఈ ప్రీమియం ప్లాన్లతో నాలుగు డివైజ్లలో కంటెంట్ ను వీక్షించొచ్చు.
నోట్: ఇప్పటిదాకా
ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించిన అభిమానులు, ఇప్పటి నుండి కనీస ప్లాన్
రూ.149తో సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఒకటే యాప్:
జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ కలిపి జియో హాట్ స్టార్ గా మారింది. ప్రస్తుతం
హాట్ స్టార్ యాప్ ను వాడుతుంటే, ఆ యాప్ అప్డేట్ తర్వాత అది జియో హాట్ స్టార్ గా మారుతుంది.
అలాగే,
జియో సినిమా యాప్ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి జియో హాట్ స్టార్
యాప్ కు రీడైరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇప్పటికే హాటార్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే
రాబోయే 3 నెలల పాటు వారికి పాత రేట్లే కొనసాగుతాయి. ఒకవేళ జియో సినిమా ప్రీమియం
సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే వారు ఆటోమేటిక్ గా జియో హాట్ స్టార్ ప్రీమియం
సబ్స్కప్షన్ కు మారుతారు.
===================
===================
0 Komentar